కడుపునొప్పితో దవాఖాన‌లో చేరిన ముఖ్యమంత్రి

కడుపునొప్పితో దవాఖాన‌లో చేరిన ముఖ్యమంత్రి
  • నిల‌క‌డ‌గా ఆరోగ్య ప‌రిస్థితి


విధాత‌: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అనారోగ్యానికి గుర‌య్యారు. కడుపు నొప్పితో బాధపడుతూ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ద‌వాఖానలో బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌ చేరారు.


అన్ని ర‌కాల‌ వైద్య ప‌రీక్ష‌లు చేశామ‌ని, ఇప్పటి వరకు ఆల్ట్రాసౌండ్‌తోపాటు ఇత‌ర‌ రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయని వ‌చ్చాయ‌ని ఐబీఎంసీ మెడిక‌ల్ సూపరింటెండెంట్‌ డాక్ట‌ర్ రాహుల్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్న‌ద‌ని పేర్కొన్నారు.


కడుపులో ఇన్‌ఫెక్షన్‌ వల్ల నొప్పి వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని పేర్కొన్నారు. మ‌రికొన్ని ప‌రీక్ష‌లు చేయాల్సి ఉన్నందున‌, ముఖ్యమంత్రి ఆసుపత్రిలోనే అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టామ‌ని రాహుల్‌రావు వెల్ల‌డించారు.