Viral Video | ఛీ.. ఛీ.. కిచెన్‌లో ప‌ని మ‌నిషి పాడుప‌ని.. వీడియో

Viral Video | ఓ ప‌ని మ‌నిషి( House Helper ) పాడు ప‌నికి పాల్ప‌డింది. అది కూడా వంట గ‌ది( Kitchen )లో. ఎంతో న‌మ్మ‌కంగా ఉన్న ఆ ప‌ని మ‌నిషి.. కుటుంబ య‌జ‌మాని ఊహించ‌ని విధంగా ప్ర‌వ‌ర్తించింది. ఈ ఘ‌ట‌న‌ను చూసి కుటుంబ స‌భ్యులు షాక‌య్యారు. మ‌రి ఆ ప‌ని మ‌నిషి చేసిన పాడు ప‌ని ఏంటో మీకు తెలుసుకోవాల‌ని ఉందా..? అయితే ఈ స్టోరీ త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే.

Viral Video | ఛీ.. ఛీ.. కిచెన్‌లో ప‌ని మ‌నిషి పాడుప‌ని.. వీడియో

Viral Video | ఉత్త‌ర‌ప్ర‌దేశ్( Uttar Pradesh ) బిజ్నూరు( Bijnor )లోని ఓ వ్యాపార‌వేత్త( Businessman ) ఇంట్లో గ‌త ప‌దేండ్ల నుంచి ఓ మ‌హిళ ప‌ని మ‌నిషిగా ప‌ని చేస్తుంది. ఆమెపై వ్యాపార‌వేత్త‌తో పాటు కుటుంబ స‌భ్యులంద‌రికీ ఎంతో న‌మ్మ‌కం ఉండేది. గౌర‌వం కూడా ఉండేది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ప‌ని మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న‌లో కుటుంబ య‌జ‌మాని మార్పు గ‌మ‌నించాడు. ఆమె ఏదో అనైతిక చ‌ర్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు గ్ర‌హించాడు.

ఈ క్ర‌మంలో కిచెన్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ర‌హ‌స్యంగా కెమెరాల‌ను ఏర్పాటు చేశాడు వ్యాపార‌వేత్త‌. దీంతో ప‌నిమ‌నిషి పాడు ప‌నులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇటీవ‌లే ఆమె కిచెన్‌లోకి ప్ర‌వేశించి.. అక్క‌డున్న ఓ గాజు పాత్ర‌లో మూత్ర విస‌ర్జ‌న( Urinate ) చేసింది. అనంత‌రం దాన్ని అక్క‌డున్న వంట పాత్ర‌ల‌పై చ‌ల్లింది. ఈ దృశ్యాలు అక్క‌డున్న ర‌హ‌స్య కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబ స‌భ్యులు షాక‌య్యారు.

ప‌ని మ‌నిషి స‌మంత్ర‌పై వ్యాపార‌వేత్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌ని మ‌నిషి స‌మంత్ర‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ప‌ని మ‌నిషిని నియ‌మించుకోవాలంటేనే భ‌య‌మేస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.