Human Waste | చెన్నై : ఓ దళిత వాడకు చెందిన మంచి నీటి ట్యాంకులో మానవ మలం( Human Waste ) కలిపారు. ఈ ఘటన తమిళనాడు( Tamil Nadu ) మధురై జిల్లా( Madurai district )లోని అమచియపురం ( Amachiapuram ) గ్రామంలో వెలుగు చూసింది.
అమచియపురంలో 200 దళిత కుటుంబాలు( Dalit Families ) నివసిస్తున్నాయి. దాదాపు 1000 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే మంచి నీటి ట్యాంకు( Drinking Water Tank ) నుంచి సరఫరా అవుతున్న నీళ్లు దుర్వాసన వచ్చాయి. రెండు రోజుల పాటు అదే దుర్వాసన రావడంతో.. స్థానికులు అప్రమత్తమయ్యారు.
అనుమానం వచ్చి గ్రామస్తులు కొందరు.. ఓవర్ హెడ్ ట్యాంక్( Over Head Tank )ను పరిశీలించారు. ఆ నీటిలో మానవ మల వ్యర్థాలు తేలియాడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. మంచి నీటి ట్యాంకులో మానవ మలాన్ని వారు గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓ 14 ఏండ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా, తానే మంచి నీళ్లలో మానవ మలాన్ని కలిపినట్లు అంగీకరించాడు. దీని వెనుకాల ఎలాంటి మత, కుల పరమైన ఉద్దేశం లేదని బాలుడు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలుడు కూడా దళితుడే అని తెలిపారు.
ఆరోగ్య శాఖ అధికారులు మంచి నీళ్ల ట్యాంకును పరిశీలించారు. తక్షణమే ట్యాంకును శుభ్ర పరచాలని ఆదేశించారు. ఇక గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గత రెండు రోజుల నుంచి తాగేందుకు నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.