Husband Bites Off Wife’s Nose | ప్రియుడితో భార్య సరసాలు.. ముక్కు కొరికి జైలు పాలైన భర్త..
Husband Bites Off Wife's Nose | లక్నో : ఓ వివాహిత( Married Woman ) తన ప్రియుడి( Lover )తో సరసాల్లో మునిగిపోగా, భర్త( Husband ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్య ముక్కు( Wife Nose ) కొరికి కటకటలాపాలయ్యాడు.

Husband Bites Off Wife’s Nose | లక్నో : ఓ వివాహిత( Married Woman ) తన ప్రియుడి( Lover )తో సరసాల్లో మునిగిపోగా, భర్త( Husband ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్య ముక్కు( Wife Nose ) కొరికి కటకటలాపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని హర్దోయ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్దోయ్ జిల్లా( Hardoi District )లోని ఓ గ్రామానికి చెందిన రామ్ ఖిలావాన్‌కు పూజ(25) అనే యువతితో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. ఆమె అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే బుధవారం పూజ ఫోన్‌లో మాట్లాడుతూ తన ప్రియుడి నివాసానికి వెళ్లింది. గ్రహించిన భర్త ఆమెను అనుసరించాడు. ఇక ప్రియుడితో సరసాల్లో మునిగి తేలుతున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
ఆగ్రహావేశాలతో ఊగిపోయిన భర్త.. భార్య ముక్కు కొరికి పరార్ అయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పూజను స్థానికులు హార్డోయ్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం పూజ ఆరోగ్యం నిలకడగా ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, భర్తను అరెస్టు చేసి జైలుకు తరలించారు.