గాడిద‌పై వెళ్లి నామినేష‌న్ దాఖ‌లు.. వీడియో వైర‌ల్‌

గాడిద‌పై వెళ్లి నామినేష‌న్ దాఖ‌లు.. వీడియో వైర‌ల్‌
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో స్వ‌తంత్ర‌ అభ్య‌ర్థి వినూత్న నిర‌స‌న‌


విధాత‌: త్వ‌రలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఐదు రాష్ట్రాల్లో చిత్ర విచిత్ర ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో స్వతంత్ర అభ్యర్థి ఒక‌రు శుక్ర‌వారం గాడిదపై కూర్చుని వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి ఇమ్రాన్‌ఖాన్ రాజ్‌గఢ్ నుంచి నామినేషన్ పత్రాలను అధికారుల‌కు స‌మ‌ర్పించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న టమాటాలు, ఉల్లిపాయలతో చేసిన దండను ధ‌రించారు.


ఎవరైనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ధ‌ర‌లు పెరిగినా వారికి ప‌ట్ట‌డం లేద‌ని, ఆ సందేశం ఇవ్వ‌డానికే గాడిదపై కూర్చొని ఉల్లిపాయలు, టమోటాలతో చేసిన దండను ధరించి నామినేష‌న్ దాఖ‌లు చేశామ‌ని పేర్కొన్నారు.


అంతకుముందు రోజు గురువారం బుర్హాన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రియాంక్ సింగ్ ఠాకూర్ కూడా తన నామినేషన్‌ సమర్పించడానికి గాడిదపై వెళ్లారు. నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను గాడిద‌లుగా మార్చుతున్నార‌ని చెప్ప‌డానికే ఇలా గాడిద‌పై వ‌చ్చాయ‌ని తెలిపారు.