న‌క్క తెలివిని ప్ర‌ద‌ర్శించిన గాడిద‌.. వైర‌ల‌వుతున్న వీడియో

ఏ వ్య‌క్తి అయినా త‌న ప‌నిలో త‌ప్పు చేసినా, తెలివిగా ఉండ‌క‌పోయినా.. అత‌డిని గాడిద‌తో పోల్చుతాం. గాడిద తెలివి అంటూ నిందిస్తుంటాం.

న‌క్క తెలివిని ప్ర‌ద‌ర్శించిన గాడిద‌.. వైర‌ల‌వుతున్న వీడియో

విధాత‌: ఏ వ్య‌క్తి అయినా త‌న ప‌నిలో త‌ప్పు చేసినా, తెలివిగా ఉండ‌క‌పోయినా.. అత‌డిని గాడిద‌తో పోల్చుతాం. గాడిద తెలివి అంటూ నిందిస్తుంటాం. ఇక అతి తెలివి ప్ర‌ద‌ర్శిస్తే న‌క్క‌తో పోల్చుతుంటాం. కానీ ఈ గాడిద‌ను చూసిన త‌ర్వాత ఆ జంతువుతో మ‌న‌షుల‌ను పోల్చం. ఎందుకంటే ఓ గాడిద న‌క్క తెలివిని ప్ర‌ద‌ర్శించింది.


న‌క్క తెలివిని ప్రద‌ర్శించిన గాడిద వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఓ ప్రాంతంలో నాలుగైదు గాడిద‌లు ఉన్నాయి. ఆ గాడిద‌ల ముందు ఓ క‌ర్ర‌ను కొంత ఎత్తులో అడ్డుగా పెట్టారు. మొద‌టి రెండు గాడిద‌లు మాత్రం ఆ క‌ర్ర‌పై నుంచి దూకి ముందుకు వెళ్లాయి. మూడో గాడిద మాత్రం ఆ ప‌ని చేయ‌లేదు. క‌ర్ర‌పై నుంచి దూక‌కుండా న‌క్క‌లా ఆలోచించింది. కాసేపు ఆలోచించి, క‌ర్ర‌ను నోటితో కింద‌కు ప‌డేసింది. ఆ త‌ర్వాత మెల్లిగా న‌డుచుకుంటూ ముందుకు వెళ్లింది. ఈ గాడిద ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌కుండా న‌క్క మాదిరి త‌న తెలివిని ప్ర‌ద‌ర్శించింద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. గాడిద తెలివికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు