DRDO & IAF Successfully test ‘ASTRA’ Missile | ‘అస్త్ర’ క్షిపణి పరీక్ష విజయవంతం
DRDO & IAF Successfully test ‘ASTRA’ Missile | విధాత : భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో కొత్త అస్త్రంగా ‘అస్త్ర’ మిస్సైల్ రాబోతుంది. ఒడిస్సా తీరంలో చేపట్టిన ‘అస్త్ర’ మిస్సైల్ పరీక్షవిజయవంతమైంది. తాజా పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత వాయుసేన నిర్వహించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అస్త్ర మిస్సైల్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఒడిసుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ ద్వారా అస్త్రను పరీక్షించారు. దృశ్య పరిధి అవతల ఉండే (బియాండ్ విజువల్ రేంజ్) లక్ష్యాలను ఛేదించే ‘అస్త్ర’ క్షిపణినికి వంద కిలోమీటర్లకు మించిన పరిధి కలిగి ఉంది. ఇందులో అధునాతన గైడెన్స్, నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ స్పీకర్ ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. మొత్తం రెండు పరీక్షలు నిర్వహించామని, అందులో భిన్న ఎత్తుల్లోని డ్రోన్లను లక్ష్యాలుగా చేసుకున్నట్లు వివరించింది. ఈ పరీక్షల్లో అన్ని వ్యవస్థలూ అంచనాలకు తగ్గట్టు పనిచేశాయని డీఆర్‌డీవో తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram