Modi oath taking ceremony | రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో వాటి మీద నిషేధం..!

Modi oath taking ceremony | దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే 2014లో తొలిసారి, 2019 రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ.. 2024 ఎన్నికల్లో కూడా గెలిచి మూడోసారి ప్రధాని కాబోతున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈసారి బీజేపీకి సొంత మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేస్తున్నది.

Modi oath taking ceremony | రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో వాటి మీద నిషేధం..!

Modi oath taking ceremony : దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే 2014లో తొలిసారి, 2019 రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ.. 2024 ఎన్నికల్లో కూడా గెలిచి మూడోసారి ప్రధాని కాబోతున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈసారి బీజేపీకి సొంత మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రధాని ప్రమాణస్వీకారం కోసం దేశ రాజధాని ఢిల్లీలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

రాష్ట్రపతి భవన్‌లో అంగరంగవైభవంగా ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
రేపు సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం మొదలుకానుంది. సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ప్రధానిగా మోదీ, మంత్రులుగా ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చురుగ్గా సాగుతున్నాయి.

మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చారు. పలు సమస్యాత్మక, సున్నిత ప్రదేశాల్లో అదనపు భద్రత బలగాలను మోహరించారు. 3,000 మంది అదనపు పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లోకి తీసుకున్నారు.

అదేవిధంగా ఢిల్లీలో డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. డ్రోన్లు, ఇతర అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌కు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. పారా గ్లైడర్స్, పారామోటార్స్, హ్యాంగ్ గ్లైడర్స్, మైక్రో ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్‌తో ఆపరేట్ చేయదగ్గ ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, క్వాడ్‌ కాప్టర్స్, పారా జంపింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లపై నిషేధం అమల్లోకి తెచ్చారు.