లండన్‌లో వేలానికి 1918 నాటి ఇండియా 10 నోట్లు

లండన్‌లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది

లండన్‌లో వేలానికి 1918 నాటి ఇండియా 10 నోట్లు

విధాత, హైదరాబాద్: లండన్‌లో 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు రెండింటిని వేలం వేయనున్నారు. 1918జూలై 2న ముంబై నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోయింది. ఆ సమయంలో సముద్రంలో నీటిపై తెలియాడుతూ రెండు 10 రూపాయల నోట్లు దొరికాయి. అరుదైన ఈ నోట్లను నూనన్స్ మేఫేర్ వేలం సంస్థ వేలం వేయనుంది. ఈ నోట్లకు రూ.2000 నుంచి 2600(2.11లక్షల నుంచి 2.74లక్షలు) పౌండ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.