వన్యప్రాణులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో ఒక్కోసారి నిపుణులకు కూడా అంచనాకు అందదు. తాజాగా ఓ పెంపుడు ఏనుగు వ్యవహరించిన తీరుతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఊరేగింపుగా వెళ్తున్న ఏనుగుకు ఆటో డ్రైవర్ విజయ్ బెల్లం తినిపించేందుకు ప్రయత్నించాడు. అనూహ్యంగా ఆ ఏనుగు తీవ్ర ఆగ్రహంతో అతడిపై దాడి చేసింది. తొండంతో ఎత్తి నేలకేసి కొట్టి, కాలితో తొక్కేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయ్ మరణించాడు. అనుకోని ఈ ఘటనతో ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలిచివేసింది.
ఎంత పెంపుడు జంతువుగా ఉన్నప్పటికి…మనుషులు ఏనుగులు వంటి వన్యప్రాణులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనమని జంతు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏనుగుకు బెల్లం.. కోపంలో తొక్కి చంపేసింది
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఊరేగింపుగా వెళ్తున్న ఏనుగుకు బెల్లం తినిపించేందుకు ప్రయత్నించిన విజయ్ అనే ఆటో డ్రైవర్‌పై అది తీవ్ర ఆగ్రహంతో దాడి చేసింది. తొండంతో ఎత్తి నేలకేసి కొట్టి, కాలితో తొక్కేసింది. తీవ్ర… pic.twitter.com/GNrqcHwssf
— BigTV APP (@BigtvApp) July 27, 2026
