Jharkhand | మరో సంక్షోభంలో జార్ఖండ్ ప్రభుత్వం.. బీజేపీలో చేరనున్న మాజీ సీఎం చంపై సోరెన్
జార్ఞండ్ లోని అధికార జేఎంఎం ప్రభుత్వం మరో సంక్షోభం వైపు సాగుతుంది. ఈడీ కేసులో అరెస్టయి సీఎం పదవి కోల్పోయిన హేమంత్ సోరెన్ ఇటీవలే జైలు నుంచి విడుదలైన మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు
Jharkhand | జార్ఖండ్ లోని అధికార జేఎంఎం ప్రభుత్వం మరో సంక్షోభం వైపు సాగుతుంది. ఈడీ కేసులో అరెస్టయి సీఎం పదవి కోల్పోయిన హేమంత్ సోరెన్ (CM Hemant Soren) ఇటీవలే జైలు నుంచి విడుదలైన మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే హేమంత్ జైలులో ఉన్న సమయంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ సీఎం చంపై సోరెన్ నుంచి ఇప్పుడు హేమంత్‌కు పదవీ గండం ఎదురవుతుంది. మాజీ సీఎం చంపై సోరేన్ (Champai Soren) తన మద్ధతుదారులతో కలిసి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు.
ఆదివారం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ ఆయన బీజేపీ (BJP) పెద్దలను కలువనున్నారు. త్వరలోనే జార్ఞండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న సమయంలో చంపై సొరెన్ బీజేపీలో చేరనుండటం జేఎఎంకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇండియా కూటమిలోని జేఎంఎంకు 45, ప్రతిపక్షాలకు 30స్థానాలు ఉండగా, 6స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చంపై సోరెన్ వెంట ఎంతమంది బీజేపీలో చేరుతారన్నదానిపైనే హేమంత్ సోరెన్ ప్రభుత్వ భవితవ్యం ఆధారపడివుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram