హైడ్రామా.. సీఎం సిద్దరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్

సీఎం సిద్దరామయ్య నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనూహ్య ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. సమావేశంలో సీఎం పదవి రేసులో ఉన్న డీకే శివకుమార్ సీఎం సిద్దరామయ్య కాళ్లు మొక్కడం వైరల్ గా మారింది

కర్ణాటక సీఎం పదవీ కోసం కాంగ్రెస్ లో ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య హైడ్రామా మీటింగ్ కొనసాగుతుంది. సిద్దరామయ్య నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనూహ్య ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. సమావేశంలో సీఎం పదవి రేసులో ఉన్న డీకే శివకుమార్ సీఎం సిద్దరామయ్య కాళ్లు మొక్కడం వైరల్ గా మారింది. డీకే శివకుమార్ ను సిద్ధరామయ్య ఆశీర్వదించారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత సిద్ధ రామయ్య, డీకేలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అరగంట నుంచి ఇద్దరి భేటీ కొనసాగుతుంది.

సీఎం పదవికి రాజీనామా లేఖ ఇవ్వడంపై ఈ సందర్బంగా మంత్రులతో సిద్ధరామయ్య సమాలోచనలు జరిపారు. పార్టీ జాతీయ నాయకత్వం సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిందని మంత్రులు, ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య వెల్లడించారు. దీంతో తాను సీఎం పదవి నుంచి తప్పుకోబోతున్నట్లుగా తెలిపారు. కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ లోక్ భవన్ లో లేనందునా..గవర్నర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందించే విషయమై సహచర మంత్రులతో సిద్దరామయ్య సమాలోచనలు చేశారు. సిద్దరామయ్య ఈ రోజు ఎప్పుడైనా సీఎం పదవికి రాజీనామా చేయవచ్చని సమాచారం. తదుపరి నూతన సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటకలో సీఎం డీకే శివకుమార్ పేరుతో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలియడం విశేషం.

Latest News