Kalvakuntla Kavitha | ప్రధాని మోదీకి కల్వకుంట్ల కవిత లేఖ !

ప్రధాని మోదీకి కవిత లేఖ! అండమాన్ నికోబార్ పేరును 'ఆజాద్ హింద్'గా మార్చాలని విజ్ఞప్తి. జనవరి 26న దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు.

Kalvakuntla Kavitha | ప్రధాని మోదీకి కల్వకుంట్ల కవిత లేఖ !

విధాత : ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అండమాన్ నికోబార్ దీవులకు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేస్తున్న డిమాండ్ కు జాగృతి కూడా మద్దతు ఇస్తోందని కవిత తన లేఖలో స్పష్టం చేసింది. ఈ అంశంపై రిపబ్లిక్ డే జనవరి 26న ఎక్స్ లో హాష్ ట్యాగ్ ఉద్యమం నడిపిస్తాం అని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తాం అని కవిత పేర్కొంది.

నిజానికి అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారు అని, వారి పేర్లను కొనసాగించకుండా మన వీరుడి పేరు ఆ ఐలాండ్ కు పెట్టాలని కవిత సూచించింది.
లక్ష్య శుద్ది, చిత్తశుద్ధి ఉన్న నాయకులంతా నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి అని కవిత తన లేఖలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

NTR | నారా లోకేష్‌కి సినీ–రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ ట్వీట్
Delhi Rains | ఢిల్లీలో వర్షం.. కశ్మీర్‌లో మంచు.. ఉత్తరాదిలో అకస్మాత్తిగా మారిన వాతావరణం