Lok Sabha Elections | నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర.. తెలుగు రాష్ట్రాల్లో కూడా
Lok Sabha Elections | నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాలుగో దశలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియనుండటంతో అన్ని ప్రధాన పార్టీలు ఆఖరి రోజు ప్రచారంలో జోరు పెంచాయి. నాలుగో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Lok Sabha Elections : నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాలుగో దశలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియనుండటంతో అన్ని ప్రధాన పార్టీలు ఆఖరి రోజు ప్రచారంలో జోరు పెంచాయి. నాలుగో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది.
నాలుగో దశలో పోలింగ్ జరగనున్న 96 పార్లమెంట్ స్థానాల్లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని 96 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది అభ్యర్థులు, జమ్మూకశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి 24 మంది అభ్యర్థులు, జార్ఖండ్‌లోని 4 పార్లమెంట్ స్థానాలకు 45 మంది అభ్యర్థులు, మధ్యప్రదేశ్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు 74 మంది అభ్యర్థిలో మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు 209 మంది అభ్యర్థులు, ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు 130 మంది అభ్యర్థులు, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నాలుగో దశలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు క్రికెటర్లు, ఒక నటుడు సహా మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. మొత్తం 96 స్థానాలకు 4,264 నామినేషన్లు రాగా స్క్రూటినీ అనంతరం ఆ సంఖ్య 1970కి చేరింది.