విధాత : పశ్చిమాసియా యుద్ద పరిస్థితులో నేపధ్యంలో హర్మూజ్ జలసంధి మార్గంలో చిక్కుకపోయిన భారత్ ఎల్పీజీ, గ్యాస్ నౌకలు క్రమంగా ఒక్కొక్కటిగా భారత్ తీరానికి చేరుకుంటున్నాయి. ఇరాన్ తాజాగా 22 భారత్ చమురు, గ్యాస్ నౌకలకు ఇచ్చిన అనుమతి క్రమంలో జగవసంత్ ఎల్పీజీ నౌక శనివారం గుజరాత్ పోర్టుకు చేరుకుంది. ఈ నౌక ట్యాంకర్‌లో 47 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ భారత్ కు చరింది. అధికారులు షిప్ టు షిప్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.
మరో 45వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ షిప్ పైన్ గ్యాస్ సైతం మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఇకపోతే హర్మూజ్ జలసంధిలో మరో 20 భారత ట్యాంకర్లు భారత్ కు ప్రయాణించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇందులో 2.3 లక్షల మెట్రిక్ టన్నుల 5 ఎల్పీజీ షిప్ ట్యాంకర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే మరో రెండు నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, వాడినార్ ఓడరేవులకు చేరుకున్నాయి. ఆ రెండు నౌకలు కలిపి 92,000 టన్నులకు పైగా ఎల్‌పీజీని తీసుకొచ్చాయి.
ఇవి కూడా చదవండి :
ఆర్టీసీని మూసే కుట్ర చేసి..మాపై నిందలా ? : బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఫైర్
Free Biryani | బంపరాఫర్.. గ్యాస్ సిలిండర్ ఇవ్వండి.. నెల రోజులు బిర్యానీ ఫ్రీగా తినండి.. !
