Big Ticket lottery | లక్కీ మ్యాన్..లాటరీలో రూ.61.37కోట్ల జాక్ పాట్
పీవీ రాజన్ అనే కేరళ వాసి అబుదాబి వేదికగా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రా సిరీస్ 281లో ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.61.37 కోట్లు) గెలుచుకున్నాడు. బిగ్ టికెట్ లాటరీని భారతీయులు వరుసగా రెండోసారి గెలవడం విశేషం. నవంబర్ 3న తీసిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో తమిళనాడుకు చెందిన శరవరణ్ వెంకటాచలం విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
విధాత : అదృష్టం ఉంటే..ఏం చేసినా విజయాలు..లాభాలు సొంతమవుతాయంటారు. అందరికి ఏమోగాని ఓ వ్యక్తికి మాత్రం అదృష్టం కోట్లు తెచ్చిపెట్టింది. సౌదీలో నివసించే కేరళ వ్యక్తి(Kerala man)కి లాటరీలో జాక్‌పాట్(jackpot) తగిలింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పీవీ రాజన్(PV Rajan lottery winner )అనే కేరళ వాసి అబుదాబి వేదికగా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రా సిరీస్ 281(Abu Dhabi Big Ticket Series 28)లో ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.61.37 కోట్లు) గెలుచుకున్నాడు. రాజన్ నవంబర్ 9న టికెట్ (282824) కొనుగోలు చేయగా, డిసెంబర్ 3న లక్కీ డ్రా తీయగా విజేతగా నిలిచారు. ఒకేసారి అన్ని కోట్లు గెలుచుకున్న అతడిని అంతా లక్కీమ్యాన్ అంటున్నారు. అయితే అతనికి కూడా అదృష్టం ఒకేసారి రాలేదండోయ్. గత 15 ఏళ్లుగా పీవీ రాజన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ..లాటరీ టికెట్లు కొంటూ వస్తున్నాడు. ఇన్నాళ్లకు అబుదాబి బిగ్ టికెట్ లక్కీ డ్రాలో అదృష్ట దేవత అతడిని కరుణించడంతో ఒక్కసారిగా రూ.61.37కోట్లు అతని సొంతమవ్వడం విశేషం. రాజన్ సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు.
బిగ్ టికెట్ లక్కీ డ్రాను అబుదాబి ప్రతినెల నిర్వహిస్తుంది. లాటరీలో గెలిచిన వారికి గ్రాండ్ ప్రైజ్ తో పాటు కన్సోలేషన్ బహుమతులను కూడా అందిస్తుంది. ఈసారి డ్రా సందర్బంగా 10 మంది కన్సోలేషన్ విజేతలు రూ.2.45లక్షలు అందుకున్నారు. అందులోనూ ముగ్గురు భారతీయులు ఉన్నారు. దీంతో అబుదాబీ లాటరీ భారతీయుల అదృష్ట దేవతగా మారిపోయింది.
వరుసగా రెండు నెలలు భారతీయులకే జాక్ పాట్
బిగ్ టికెట్ లాటరీని భారతీయులు వరుసగా రెండోసారి గెలవడం విశేషం. నవంబర్ 3న తీసిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో తమిళనాడుకు చెందిన శరవరణ్ వెంకటాచలం విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల బిగ్ టికెట్ లక్కీ డ్రాను నిర్వాహకులు రీచర్డ్, బ్రౌచ్ లసమక్షంలో గత నెల లాటరీ విజేత అయిన భారతీయుడు వెంకటాచలం చేతుల తీయించారు. ఇందులో పీవీ రాజన్ టికెట్టుకు బంపర్ ఆఫర్ తగలడంతో అతను ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. లాటరీ తగిలిన విషయాన్ని నిర్వాహకులు ఫోన్ లో రాజన్ కు చెప్పడంతో అతను సంతోషంతో గంతులేశాడు. తాను గెలుచుకున్న లాటరీ డబ్బులను తన 15 మంది సహచరులతో పంచుకుంటానని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram