Leopards | పారిశ్రామిక‌వేత్త హ‌ర్ష గోయెంకా ఇంటి ప‌రిస‌రాల్లో చిరుత పులుల షికారు.. వీడియో

Leopards | ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌, ఆర్‌పీజీ ఎంట‌ర్‌ప్రైజెస్ చైర్మ‌న్ హ‌ర్ష గోయెంకా(Harsh Goenka ) ఓ వీడియోను విడుద‌ల చేశారు. అదేంటంటే.. తన ఇంటి ముందు ఉన్న ర‌హ‌దారిపై చిరుత‌( Leopard ), బ్లాక్ పాంథ‌ర్ ( black panther ) షికారు చేసిన దృశ్యాలు అవి.  

చిరుత‌( Leopard ), బ్లాక్ పాంథ‌ర్ ( black panther ) షికారుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని హ‌ర్ష గోయెంకా త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కునూరు( Coonoor ) లోని త‌మ ఇంటి ముందు జులై 30వ తేదీన చిరుత‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయ‌ని తెలిపారు. చిరుత‌ల భూభాగంలో తాము అతిథుల‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఒక చిరుత పులి హ‌ర్ష గోయెంకా ఇంటి మూడో గేటు ముందు నుంచి ప‌క్క‌నే చెట్ల పొద‌ల వైపు చూస్తూ వెళ్లిపోయింది. మ‌రో బ్లాక్ పాంథ‌ర్ కూడా కాసేపు గేటు ముందున్న చెట్ల పొద‌ల వైపు చూసింది. అనంత‌రం ముందుకు సాగి.. చెట్ల పొద‌ల్లోకి ప‌రుగెత్తింది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కునూరు త‌మిళ‌నాడులోని ఓ కొండ ప్రాంతంలో ఉంటుంది. నీల‌గిరి కొండ‌ల్లో టీ ఎస్టేట్‌ల‌కు ప్ర‌సిద్ధి చెందిన ప్రాంతంలో కునూరు ఉంది.