కాలం మారిపోయిందంటే ఏదో అనుకున్నారు గాని..గతంలో భార్యలపై భర్తల వేధింపులు, దాడులు అధికంగా జరిగితే..ఇప్పుడు భర్తలనే ఖతం పట్టిస్తున్న భార్యల కేసులు పెరిగిపోతున్నాయి. ఓ భార్య తన భర్తను ముక్కలుగా నరుకుతూ ఆనందంతో సెల్ఫీలు తీసుకున్న కేసు వైరల్ గా మారింది. చెన్నైలో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో పోలీసులు కేసు విచారణలో గుర్తించిన అంశాలు సంచనం రేపాయి.

వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. శరీరాన్ని ముక్కలుగా చేసి సూట్‌కేస్‌లో పెట్టి పెరంబూర్ రైల్వే స్టేషన్‌లో పడేసింది. మిస్టరీ సూట్ కేసు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సూట్ కేసు తెరిచి చూసి షాక్ అయ్యారు. తల, కాళ్లు, చేతులు లేని మొందం అందులో కుక్కి ఉంది. ఈ కేసులో మృతుడి గుర్తింపు, నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.

అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్‌కోడ్, కాల్ డేటా, వాట్సాప్ లొకేషన్ ఆధారంగా చివరకు పోలీసులు నిందితుల వరకు చేరుకున్నారు. ఇక్కడ పోలీసులకు మరో షాక్ ఎదురైంది. నిందితుల విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడటం వారిని అశ్చర్యపరిచింది. భర్త శరీర భాగాలను నరికేటప్పుడు భార్య ఆనందంగా సెల్ఫీలు తీసుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు వాటిని చూసి మరి ఇంత క్రూరత్వం ఏంటని విస్మయానికి గురయ్యారు. భర్త శరీరం ముక్కలతో భార్య తీసుకున్న సెల్పీలు కూడా ఈ కేసులో కీలక ఆధారాలుగా మారి.. చివరకు అవే ఆమెను సాక్ష్యాధారాలతో పట్టించడం విశేషం.

పోలీసుల వివరాల ప్రకారం…మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన అమీర్ అలీ (40)గా గుర్తించారు. అతడు చెన్నై తేనాంపేట ప్రాంతంలో నివాసం ఉంటూ, ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు వసతి, సహాయక సేవలు అందించే పనితో ఉపాధి పొందుతున్నాడు. అయితే అమీర్ కు మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో భార్య రోహిమా ఖాతూన్ తో తరచూ అతనితో గొడవ పడుతుండేది.

ఈ నేపథ్యంలో రోహిమా తన పాత ప్రియుడు అష్రఫ్ అలీతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ముందుగా భర్త అమీర్ కు మత్తు మందు ఇచ్చి, అనంతరం గొంతు కోసి హత్య చేశారు. తర్వాత శవాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు వెల్లడైంది. మొండెంను సూట్‌కేస్‌లో పెట్టి చెన్నైలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్-4 సమీపంలో వదిలివెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.చెన్నై పరిసర ప్రాంతాల్లో వేర్వేరుగా పారేసినట్లు భావిస్తున్న మృతుడి శరీర భాగాలలో కొన్ని చెంగల్పట్టు సమీపంలోని సరస్సు, బకింగ్‌హామ్ కాలువ ప్రాంతాల్లో లభించినట్లు సమాచారం.