Maoists | శాంతిచర్చలకు మేం సిద్ధం.. కానీ: శాంతి చ‌ర్చ‌ల‌పై మావోయిస్టుల తాజా స్పంద‌న‌

శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే తాము నాయకత్వంతో మాట్లాడుకోవాల్సి ఉంటుందని, పార్టీ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని తెలిపింది. నిరంతరాయంగా కొనసాగుతున్న పోలీస్ ఆపరేషన్ల కారణంగా ఇది సాధ్యం కావడం లేదని పేర్కొన్నది. అందుకే అనుకూల వాతావరణం కోసం ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

Maoists | శాంతిచర్చలకు మేం సిద్ధం.. కానీ: శాంతి చ‌ర్చ‌ల‌పై మావోయిస్టుల తాజా స్పంద‌న‌

Maoists | ‘శాంతి చర్చలు అనేవి సీసీ/ఎస్‌జడ్‌సీ పరిధిలోని విషయం. ఈ కమిటీలు మీడియాలో వస్తున్న సమాచారాన్ని చూసుకోవడం, వెంటనే ప్రతిస్పందించడంలో అనేక టెక్నికల్ అడ్డంకులు ఉన్నాయి. రక్షణ కారణాల వలన మా ఉన్నత స్థాయి కమిటీల వైపు నుండి వెంటనే ప్రతిస్పందన ఇవ్వలేని స్థితి ఏర్పడింది. మా సీసీ ఇచ్చిన శాంతి చర్చల పిలుపును ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే ఈ ప్రకటనను చూడాలి. ఈ స్టేట్‌మెంట్‌ ముఖ్య ఉద్దేశం బస్తర్‌లో జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయడానికే’ అని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర – పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

తమ కేంద్ర కమిటీ ఇటీవల శాంతి చర్చల గురించి ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసిందని, అందులో కూడా శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చాలని పేర్కొన్నదని తెలిపింది. తమ కేంద్ర కమిటీ కోరిన ‘అనుకూల వాతావరణం’ డిమాండ్‌ను ఛత్తీస్‌గఢ్ సీఎం విజయశర్మ నిరాకరించారని పేర్కొన్నది. అనుకూల వాతావరణం లేకుండా శాంతి చర్చలు సాధ్యం కాబోవని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ అనుసరిస్తున్న వైఖరినే ఇంకా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా స్పష్టమవుతున్నదని పేర్కొంది. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం అనుసరిస్తున్న లొంగుబాటు విధానమే సమస్యకు పూర్తి పరిష్కారం అని చెప్పడాన్ని కూడా మావోయిస్టు పార్టీ తిరస్కరించింది.

శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే తాము నాయకత్వంతో మాట్లాడుకోవాల్సి ఉంటుందని, పార్టీ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని తెలిపింది. నిరంతరాయంగా కొనసాగుతున్న పోలీస్ ఆపరేషన్ల కారణంగా ఇది సాధ్యం కావడం లేదని పేర్కొన్నది. అందుకే అనుకూల వాతావరణం కోసం ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. చర్చల ప్రక్రియ ముందుకు వెళ్లాలంటే అది ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వస్తే తమ పని ప్రారంభిస్తామని తెలిపింది. తమ ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని దేశంలోని ప్రజాస్వామికవాదులు, మేధావులు, మానవ హక్కుల సంఘాలు, సామాజిక సంఘాలు, కార్యకర్తలు, ప్రజాపక్ష జర్నలిస్టులు అందరికీ మావోయిస్టు పార్టీ ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి రూపేష్ విజ్ఞప్తి చేశారు.