Maoists Surrender | రేపు ఆశన్న సహా 70మంది లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న (రూపేశ్) గురువారం ఛత్తీస్‌గఢ్ సీఎం, డిప్యూటీ సీఎంల సమక్షంలో 70 మంది పీఎల్‌జీఏ సభ్యులు కమాండర్లతో కలిసి లొంగిపోనున్నారు.
విధాత : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్, అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు గురువారం చత్తీస్ గఢ్ ప్రభుత్వానికి లొంగిపోనున్నారు. ఆశన్న ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్ల పీఎల్ జీఏ సభ్యులు, కంపెనీ ఫ్లాటన్ కమాండర్లు, ఏరియా కమిటీ సభ్యులు 70మందితో కలిసి గురువారం లొంగిపోయేందుకు రంగం సిద్దమైంది. చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ శర్మల సమక్షంలో ఆయుధాలతో సహా వారంతా లొంగిపోనున్నారు.
బుధవారమే కాంకేర్ జిల్లా ఎస్పీ ముందు ఉత్తర బస్తర్ డివిజన్ ఇంచార్జి రాజమన్, మాడ్ డివిజన్ ఇంచార్జీ రతన్ రాజ్మాన్ లు 50మంది మావోయిస్టులతో ఆయుధాలతో సహా లొంగిపోయారు. వారిని అంతాఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఎఫ్ క్యాంపుకు తరలించారు. వారితో పాటు ఆశన్న, ఆయన వెంట ఉన్న మిగతా నాయకులు, సభ్యులు కలిపి మొత్తం 70మంది వరకు గురువారం అధికారికంగా సీఎం విష్ణుదేవ్ ముందు లొంగిపోనున్నట్లుగా అధికార వర్గాల సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram