HIV : ఐటీ ఉద్యోగులారా! తస్మాత్ జాగ్రత్త..ఆ వైరస్ తో డేంజర్
దేశంలో ఐటీ ఉద్యోగులలో హెచ్‌ఐవీ కేసులు పెరిగిపోతున్నట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నివేదిక వెల్లడించింది. మత్తు ఇంజెక్షన్లు, రక్షణ లేని శృంగారం ప్రధాన కారణాలుగా పేర్కొంది.
విధాత : దేశంలో ఐటీ ఉద్యోగులను ఇటీవల ఓ వార్త భయపెడుతుంది. ఓ వైరస్ ఎక్కువగా ఐటీ ఉద్యోగులలోనే ఎక్కువగా విస్తరిస్తుందన్న సమాచారం వారిలో ఆందోళన కల్గిస్తుంది.
జాతీయ ఏయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ఇటీవల వెల్లడించిన ఓ నివేదికలో దేశంలో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవీ కేసులు పెరిగిపోతున్నాయని పేర్కొనడం సంచలనంగా మారింది. ఐటీ రంగానికి సంబంధించిన హెచ్ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. మత్తు ఇంజెక్షన్లు, రక్షణ లేని శృంగారం వల్ల ఐటీ రంగంలో హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి పెరుగుతోందని న్యాకో వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవీ సంక్రమణ శాతం పెరుగుతోందని న్యాకో తాజాగా హెచ్చరించింది. ఆధునిక జీవనశైలీ, పాశ్చత్త పోకడలు..విచ్చల విడి శృంగారం ఐటీ ఉద్యోగుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్ తరహా తక్షణ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో అరక్షిత శృంగారం పెరగడం కూడా హెచ్ఐవీ వ్యాప్తికి దోహదం చేస్తుంది. హెచ్ఐవీ ఒక వైరస్. ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది ప్రాణాంతకమైన ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్) గా మారుతుందని వైద్యులు గుర్తు చేస్తున్నారు.
ఆ రెండు రాష్ట్రాల్లో అధికం
ఐటీ రంగం తర్వాతా వ్యవసాయ కూలీల్లో హెచ్ఐవీ విస్తరణ స్వల్పంగా పెరుగుతోందని న్యాకో వెల్లడించింది. న్యాకో నివేదిక మేరరకు ఎయిడ్స్ కేసుల్లో మహారాష్ట్ర (3,62,392), ఏపీ (2,75,528) టాప్ లో ఉన్నాయి. దీనిపై అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ పరీక్షల టెస్టులను పెంచాలని న్యాకో హెచ్చరించింది. 2030 నాటికి ఎయిడ్స్ ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్లు న్యాక్ తెలిపింది. తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే ఈసారి హెచ్ఐవీ సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కు తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీశాక్) వెల్లడించింది ఎయిడ్స్ సంబంధిత మరణాలలో 80శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా శిబిరాలు నిర్వహించి 8,21,508 మందిని స్ర్కీనింగ్ చేయగా.. కొత్తగా 5,517 మందిని పాజిటివ్‌గా గుర్తించామని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,38,290 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులను గుర్తించి ఏఆర్‌టీ చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించాయి. 2024-25లో హెచ్ఐవీతో 193మరణాలే నమోదైనట్టు పేర్కొన్నాయి.
ఆ ఒక్క జిల్లాలోనే 7,400మంది బాధితులు
బీహార్ రాష్ట్రంలో మొత్తం 97,000 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, సీతామర్హి జిల్లాలోనే 428 మంది పిల్లలు సహా 7,400 మంది ఏయిడ్స్ బాధితులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వీరిలో 18 ఏళ్ల లోపు 252 మంది అబ్బాయిలు, 135 మంది అమ్మాయిలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఆరోగ్య రికార్డులు వెల్లడించాయి. పెద్దల్లో పురుషులు–మహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి నెల 40–60 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికుల కారణంగానే వైరస్ వ్యాప్తి అధికమైందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీతామఢి ఏఆర్టీ సెంటర్‌లో ప్రతి నెల 5000 మంది రోగులకు ప్రభుత్వం ఉచిత మందులు అందిస్తోంది. హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లాలో కేసులు తగ్గకపోవడం ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇవి కూడా చదవండి :
Japan Earthquake : జపాన్ లో మరోసారి భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు
Chandrababu Naidu : కాగ్నిజెంట్ తో లక్షమందికి ఉద్యోగావకాశాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram