PM Modi | పాతిక కెమెరాల మధ్య మోదీ ధ్యానమా?
ఎన్నికల ప్రచారం ముగించుకుని ధ్యానంలోకి వెళ్లిన ప్రధాని మోదీ వివేకానంద మెమోరియల్ రాక్ ఫొటోలపై నెటిజన్లు తలోరీతిన స్పందిస్తున్నారు

మోదీ ఫొటోలపై పలువురు నెటిజన్ల కామెంట్స్
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం ముగించుకుని ధ్యానంలోకి వెళ్లిన ప్రధాని మోదీ వివేకానంద మెమోరియల్ రాక్ ఫొటోలపై నెటిజన్లు తలోరీతిన స్పందిస్తున్నారు. హిపోక్రసీ పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయిందని ఒకరు వ్యాఖ్యానించగా.. ఇటువంటి డ్రామాలు చేసి ఎన్నికల్లో గెలిచేందుకు మోదీకి ఉన్న చివరి ఆప్షన్ ఇదే. అయినా.. ఆయన ఇందులో సఫలం కాలేరు.. అది వారికి రుచించకపోయినా అదే నిజం అని మరొకరు కామెంట్ చేశారు. బైబై బీజేపీ అనే హ్యాష్‌ట్యాగ్ జోడించారు.
మోదీ సూర్యుడికి పూజ చేస్తున్న ఫొటోనుద్దేశించి ఒక యూజర్ ఇండియా కూటమి సూర్యోదయానికి ఇది నిర్వచనం అని ఒకరు రాశారు. దేవుడు, మతం పేరుతో తప్ప చేసిందేంటో చెప్పి ఓట్లడిగేవాళ్లను నేను చూడలేదు.. అని మరొకరు స్పందించారు. ఒకరు ఇది ఇండియా సూర్యాస్తమయం అని రాశారు. అసలు చుట్టూ పాతిక కెమెరాలు పెట్టుకుని ధ్యానమేంటని ఒకరు సందేహం వ్యక్తం చేశారు. ‘ఏం కంగారు పడకండి.. ఆస్కార్ వాళ్లు సముద్రం గుండా వస్తున్నారు.. అని ఒకరు సెటైర్ వేశారు.