First Sunrise Of 2026 : కొత్త ఏడాదిలో తొలి సూర్యోదయం..చూసేయండి!
నూతన సంవత్సరం 2026 తొలి సూర్యోదయం గౌహాతీలో అద్భుతంగా కనువిందు చేసింది. బ్రహ్మపుత్ర తీరం బంగారు వర్ణంలో మెరుస్తూ కొత్త ఏడాదిని ఆహ్వానించింది.
విధాత : నూతన సంవత్సరం 2026 ప్రారంభం వేళ తొలి సూర్యోదయం ఎక్కడో తెలుసా. కొత్త సంవత్సరంలో అస్సాంలోని గౌహతిలో తొలి సూర్యోదయం అత్యంత రమణీయంగా ఆవిష్కృతమైంది. బ్రహ్మపుత్ర నది తీరాన ఉదయించిన భానుడి తొలి కిరణాలు నగర ఆకాశాన్ని బంగారు వర్ణంతో ముంచెత్తాయి. చలిగాలులు వీస్తున్నప్పటికీ, వందలాది మంది ప్రజలు ఉదయాన్నే నదీ తీరానికి చేరుకుని ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. తెల్లవారుజామున ఆకాశం నుంచి కురుస్తున్న మంచు తెరలను చేదించుకుంటూ తొలి పొద్దు సూర్య కిరణాలు భూమిని తాకిన తరుణం చూసినవారికి అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది.
ప్రపంచంలో కొత్త ఏడాది న్యూజిలాండ్ ఆక్లాండ్ లో తొలుత ప్రారంభమవుతుంది. అనంతరం ఆస్ట్రేలియాలో సిడ్నీలో నూతన సంవత్సరం మొదలవుతుంటుంది. కొత్త ఏడాది భారత్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని డోంగ్ వద్ద సూర్యోదయంతో ప్రారంభం అవుతుంది. కన్యాకుమారి, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ సముద్ర తీరాల్లో కొత్త ఏడాది తొలి సూర్యోదయం వీక్షించిన స్థానికులు ఆనంద పరవశులయ్యారు. ఈ ఏడాది అస్సాంలోని గౌహాతీలో తొలి సూర్యోదయం ఆవిష్కృతమైంది. ఇక ఏపీలో కూడా అద్భుతమైన సూర్యోదయం అరకులోయలో కనువిందు చేసింది.
ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో కొత్త ఏడాది వేడుకలను ప్రజలు భక్తి భావంతో ప్రారంభించుకున్నారు. ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్‌లో 1,001 దీపాలను వెలిగించి, నిర్వహించిన గంగా హారతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, పూరి జగన్నాధ్ వంటి పుణ్యక్షేత్రాలలో కూడా వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పూజలు నిర్వహించి నూతన ఏడాదిని ప్రారంభించారు. ఇక తిరుమల, యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రాలు న్యూఇయర్ సందర్బంగా భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.
ఇవి కూడా చదవండి :
New Year Food Orders : న్యూ ఇయర్ ఆర్డర్ లో మేటి.. బిర్యానీకి లేదు సాటి!
Gold, Silver prices| న్యూ ఇయర్ తొలి రోజున పెరిగిన బంగారం..తగ్గిన వెండి ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram