Farmer | దేశం వెన్నెముక విరిగిపోయింది.. ఎద్దుగా అవతారమెత్తిన అన్నదాత ఆవేదన ఇదీ..
Farmer | దేశం వెన్నెముక విరిగిపోయింది.. 65 ఏండ్ల వయసులోనూ ఓ ఎద్దు( bullocks ) మాదిరి మెడకు నాగలి( Plough ) కట్టుకుని పొలం దున్నడం కష్టంగా మారింది. దేశానికి వెన్నెముక రైతు( Farmer ) అని చెబుతున్న ప్రభుత్వాలు.. తమను ఆదుకోకుండా.. చివరకు తమ వెన్నెముకలను విరగ్గొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు ఓ వృద్ధ రైతు.

Farmer | రైతు( Famer )ను రాజు చేస్తాం.. అన్నదాత ఆదాయం పదింతలు పెంచుతాం అని అధికార పార్టీలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తాయి. అంతేకాదు.. అన్నదాత కోసం అనేక సంక్షేమ పథకాలు( Welfare Schemes ) అమలు చేస్తూ.. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని చెబుతుంటారు. కానీ అన్నదాతల( Farmers ) పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం రైతులు తమ పొలం దున్నుకునేందుకు అటు ఎద్దులను, ఇటు ట్రాక్టర్లను కిరాయికి తెచ్చి దున్నుకునే పరిస్థితి లేదు. ఓ రైతు.. ఎద్దుగా అవతారమెత్తి.. మెడకు నాగలి( Plough ) కట్టుకుని పొలం దున్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర( Maharashtra )లోని లాతూర్ జిల్లాలో వెలుగు చూసింది.
లాతూరు జిల్లా( Latur District )లోని హడోల్టి గ్రామానికి చెందిన అంబదాస్ గోవింద్ పవార్(65)కు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేయాలనే తపన ఉంది. కానీ ఆయనకు ఎద్దుల్లేవు. దీంతో పొలం దున్నడానికి తానే ఎద్దుగా మారాడు. మెడకు నాగలి కట్టుకుని, భార్య సహకారంతో తన పొలంను తానే దున్నుకున్నాడు. గత ఏడేండ్ల నుంచి ఇలానే చేస్తున్నానని వృద్ధ రైతు తెలిపాడు. మరి ఎందుకు ఎడ్లతో కానీ ట్రాక్టర్‌తో కానీ పొలం దున్నియొచ్చు కదా అని అడిగితే.. తన దగ్గర అంత డబ్బు లేదని బోరుమన్నాడు. అధికార పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి తప్పితే.. ఆచరణలో చేసి చూపించడం లేదని ఆ రైతు అసహనం వ్యక్తం చేశాడు. రైతులకు ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ధ్వజమెత్తాడు.
ఒక వేళ ఎద్దులను కిరాయికి తెస్తే రోజుకు రూ. 2500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నాడు. ట్రాక్టర్‌కు దీని కంటే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నాడు. అంతేకాకుండా విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పాడు. వయసు పెరిగిపోయింది.. భారతదేశానికి వెన్నెముక రైతు అని చెప్పుకునే తమకు సరైన పథకాలు అందక.. కష్టం చేసి చేసి తమ వెన్నెముక విరిగిపోయిందని కన్నీరు పెట్టుకున్నాడు రైతు అంబదాస్.
Maharashtra: No Money For Bullocks Or Tractor, 65-Year-Old Latur Farmer Ties Himself To Plough.#maharashtra #Farmer #Latur #FPJ pic.twitter.com/gEolaUqMVz
— Free Press Journal (@fpjindia) July 1, 2025