AISF | నూతన విద్యా విధానం రద్దు చేయాలి.. ఏఐఎస్ఎఫ్ మహాసభలో డిమాండ్
AISF | అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) రాష్ట్ర 4వ మహాసభలు నిజామాబాద్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం ప్రారంభమయ్యాయి.
AISF | అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) రాష్ట్ర 4వ మహాసభలు నిజామాబాద్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సభా ప్రాంగణానికి నరసింహారెడ్డి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి సీపీఐ నాయకులు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అధ్యయనం – పోరాటం నినాదంతో ఈ నెల 20వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ మహాసభలు కొనసాగనున్నాయి.
ఈ మహాసభలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలకకుండా అందరికీ ఒకే ఉచిత విద్యావిధానాన్ని రూ పొందించాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్‌ఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తున్నదన్నారు. అన్ని విద్యార్థి సంఘాలకు మూలం ఏఐఎస్‌ఎఫ్ అని, ఇది అన్ని సంఘాలకు మాతృ సంఘమని పేర్కొన్నారు. ఎందరో నాయకులు ఈ సంఘం ద్వారా ఎదిగారని, తాను కూడా ఏఐఎస్‌ఎఫ్ ద్వారా నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా ఉన్నత విద్యాసంస్థలకు నిధులు రాకుండా చేస్తున్నదని ఆరోపించారు. విద్యార్థులు భగత్‌సింగ్, చేగువేరాను హీరోలుగా గుర్తించాలని, సినిమా హీరోలని కాదని సూచించారు.
1936లో ఏఐఎస్ఎఫ్ ఏర్పాటు..

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏర్పడి 90 ఏళ్లు అవుతోంది. ఏఐఎస్‌ఎఫ్ సీపీఐ పార్టీకి అనుబంధగా పని చేస్తుంది. దీనిని 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేశా రు. బ్రిటీష్ పాలకుల నుంచి భారతదేశం విముక్తి కోసం ఏఐఎస్‌ఎఫ్ పని చేసింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటంలో విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. విద్యారంగ సమస్యల కోసం నిరంతర పోరాటాలు ఈ సంస్థ ద్వారా చేస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram