Knife in Lungs | ఊపిరితిత్తుల్లో 8 సెం.మీ. కత్తి.. మూడేండ్ల పాటు నరకయాతన
Knife in Lungs | ఓ వ్యక్తి ఊపిరితిత్తుల్లో( Lungs ) ఉన్న కత్తి( Knife )ని వైద్యులు( Doctors ) విజయవంతంగా తొలగించారు. దీంతో మూడేండ్ల నరకయాతనకు తెరపడింది. సర్జరీ సక్సెస్ కావడంతో బాధిత వ్యక్తితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Knife in Lungs | భువనేశ్వర్ : ఓ వ్యక్తి ఊపిరితిత్తుల్లో( Lungs ) ఉన్న కత్తి( Knife )ని వైద్యులు( Doctors ) విజయవంతంగా తొలగించారు. దీంతో మూడేండ్ల నరకయాతనకు తెరపడింది. సర్జరీ సక్సెస్ కావడంతో బాధిత వ్యక్తితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మూడేండ్ల క్రితం కూలీ పనుల నిమిత్తం బెంగళూరు వెళ్లాడు. అయితే ఓ వ్యక్తితో ఏర్పడిన గొడవ జరిగింది. దీంతో అతను కూలీ మెడ భాగంలో పదునైన కత్తితో దాడి చేశాడు. ఆ కత్తి ఊపిరితిత్తుల దాకా గుచ్చుకుంది. 8 సెం.మీ. కత్తి మొన భాగం ఊపిరితిత్తుల్లోనే ఉండిపోయింది. శరీరం వెలుపల ఉన్న కత్తి భాగాన్ని మాత్రమే బెంగళూరు వైద్యులు తొలగించారు.
కొన్ని రోజులకు బాధితుడి అనారోగ్యానికి గురయ్యాడు. పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గతేడాది కాలం నుంచి ఈ సమస్య మరింత తీవ్రమైంది. టీబీ అనుకుని గత తొమ్మిది నెలల నుంచి దానికి మెడిసిన్ కూడా వాడుతున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం బాధితుడి దగ్గినప్పుడల్లా రక్తం రావడం జరుగుతుంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు బాధిత వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్ తీయగా అతని ఊపిరితిత్తుల్లో కత్తి ఉన్నట్లు గ్రహించారు. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సర్జరీ నిర్వహించి కత్తిని తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఊపిరి పీల్చుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.