Army Chief Gen Dwivedi : ఆపరేషన్ సింధూర్ మూడు రోజుల్లో ముగియలేదు:ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. పాక్ మద్దతు ఉగ్రవాదం, ఎల్ఓసీ చొరబాట్లు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ ఏడాది మే 10న పాకిస్తాన్ తో కాల్పుల విరమణతో ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. మే 10న యుద్దం ముగిసిందని మీరు అనుకుంటున్నారు.. లేదు… చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందున.. అది చాలా కాలం పాటు కొనసాగిందని ఆయన అన్నారు. అయితే దీనికి సంబంధించిన విషయాలను ఇంతకుమించి బయటకు చెప్పలేనని ఆయన అని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో బిఫోర్ అండ్ బియాండ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నియంత్రణ రేఖ వెంబడి ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయడం ఇంకా తొందరపాటేనని ఆయన అన్నారు. పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదం ఇంకా ముగియలేదన్నారు. సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్మీ చీఫ్ తెలిపారు.ఎల్ఓసీ పరిస్థితిపై ఆపరేషన్ సిందూర్ ప్రభావం గురించి వ్యాఖ్యానించడం ఇంకా తొందరపాటే అవుతుందన్నారు. ఎల్ఓసీలో చొరబాటు ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
సాయుధ దళాల సమన్వయాన్ని ప్రశంసిస్తూ ఆపరేషన్ సమయంలో సైన్యం పక్కా ప్రణాళికతో వ్యవహరించిందని ఆయన అన్నారు.88 గంటల్లో ప్రణాళిక వేయడానికి, ఆదేశాలు జారీ చేసేందుకు సమయం లేదన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఉన్నారని ఆయన తెలిపారు.