Breaking: వినియోగదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు!

Breaking: వినియోగదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు!

విధాత: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.కేంద్రం పెట్రోల్, డీజిల్ లపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ధరల పెంపుకు కారణమైంది. పెట్రోల్, డీజిల్ లపై లీటర్ కు రూ. 2 పెరిగింది. అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పూ ఉండబోదని కేంద్రం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచాలని నిర్ణయించుకుంది. అయితే పెరిగిన ధరలతో ప్రభావం వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని..పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చమురు సంస్థలు తమ లాభాల్లో ఈ మొత్తాన్ని సర్ధుబాటు చేసుకుంటాయని వెల్లడించింది.

చమురు ధరల పెంపుపై ఖర్గే విమర్శలు
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికి ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 2014మే నెలతో పోలిస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు 41శాతం తగ్గినా..ఎక్సైస్ సుంకం పెంచుతున్నారే తప్ప చమురు ధరలు తగ్గించడం లేదన్నారు. టారిఫ్ లపై ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. ప్రభుత్వం వైఖరితోనూ మదుపర్లు రూ.19లక్షల కోట్లు నష్టపోయారని ఖర్గే ఆరోపించారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ డీజిల్ పెట్రోల్ ధర రూ. 107.46, డీజిల్ ధర రూ. 95.7 గా ఉంది.  అదేవిధంగా దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్ పై రూ.50, ఉజ్వల్ పథకం సిలిండర్లపైనా రూ.50 పెంచారు.