రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అత్యాచారాలు, హత్య, దాడులు,చోరీల ఘటనలలో పోలీసులు నిందితుల పట్ల వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్ వైరల్ గా మారాయి. ఇప్పటిదాక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సాగిన నేరస్తుల ఆస్తుల విధ్వంసం బుల్డోజర్ కల్చర్ శిక్షలు, నిందితుల పట్ల తక్షణ శిక్షల పద్దతులు ఇతర రాష్ట్రాలకు సైతం పాకుతున్నాయి. ఆయా రాష్ట్రాలలో నిందితుల పట్ల పోలీసుల వ్యవహరశైలి మానవ హక్కులు, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనల కిందకు వస్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏపీలో సైతం గాదె సాయి కృష్ణ కస్టోడియల్ అదృశ్యం కేసుపై కూడా అలాంటిదే కావడం గమనార్హం.
రాజస్థాన్ లో అత్యాచారం నిందితుల ఆస్తుల కూల్చివేత
తాజాగా రాజస్థాన్‌లో వెలుగుచూసిన 13 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులో నిందితుల హోటళ్లను, ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ఆమెను ఓ హోటల్ యజమానికి విక్రయించాడు. అనంతరం ఐదు రోజుల పాటు ఒక హోటల్ నుంచి మరో హోటల్‌కు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగులోకి రావడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. బాధితురాలు చెప్పిన వివరాలు, పోలీసుల దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలకు దిగడమే కాకుండా, కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోటళ్లపై బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ కేసులో బాధిత బాలిక నిరంతర అత్యాచారాల కారణంగా తీవ్ర నొప్పితో బాధపడుతూ ఏడుస్తుంటే, ఆమెను మత్తులోకి దించేలా బలవంతంగా మద్యం తాగించేవారని విచారణలో వైల్లడైంది.బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తూ…ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసి, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే శ్రీగంగానగర్ జిల్లాలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఈ ఘటన రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది. నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలని, ఈ నేరానికి వేదికగా మారిన అక్రమ హోటళ్లన్నింటినీ కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకున్న జిల్లా యంత్రాంగం, కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది.
ఈ కేసుపై జిల్లా ఎస్పీ హరిశంకర్ స్పందిస్తూ.. దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని, నిందితులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. బాధితురాలికి అన్ని విధాలా వైద్య, మానసిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించి కఠిన శిక్ష పడేలా బలమైన ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ లో నిందితుడి ఎన్ కౌంటర్
పశ్చిమ బెంగాల్‌లోని బరూయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రవాష్ మోండల్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు అతడిని స్పాట్‌కు తీసుకెళ్లగా.. పోలీసులపై దాడి చేసి తుపాకి లాక్కుని పోలీసులపై ఓ రౌండ్ కాల్పులు జరిపి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేరగాళ్లకు హెచ్చరికలు చేసేందుకే ఎన్ కౌంటర్ వ్యవహరం సాగించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాలిక హత్యాచార ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బాలిక మృతదేహం లభించిన కొద్ది గంటల్లోనే అనుమానంతో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. ప్రతిపక్ష టీఎంసీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని నిరసనలు చేపట్టింది. దీంతో ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది.72 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి డీజీపీని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయడం గమనార్హం.
గుజరాత్ లో నిందితుల ఊరేగింపు
గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో మార్చి నెలలో ఓ ఫామ్‌హౌస్‌పై దాడి ఈ కేసులో సుమారు 18 మంది నిందితులను పటాన్ పోలీసులు పట్టుకుని, వారి చేతులకు తాళ్లు కట్టి వీధుల్లో నడిపిస్తూ పబ్లిక్ పరేడ్ నిర్వహించారు. దాడి సమయంలో అక్కడ ఉన్న పోలీసులు వెనకడుగు వేసి పారిపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆరుగురు పోలీసులతో సహా ఎనిమిది మంది అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు అదనపు బలగాలతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. మార్చి 19న నిందితులను ఛానాస్మా పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక బస్ స్టాండ్ వరకు తాడులతో కట్టి పబ్లిక్‌గా నడిపించి, సంఘటనా స్థలంలో విచారణ జరిపించారు. ఈ విధంగా నిందితులను పబ్లిక్‌గా ఊరేగించడంపై విమర్శలు వచ్చాయి. గతంలో గుజరాత్ హైకోర్టు ఇలా బహిరంగంగా ఊరేగించడం మానవ హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేయడం గమనార్హం.
बड़ी खबर🚨
ये राजस्थान की उस भयानक घटना के आरोपी हैं एक रिक्शा चालक ने 13 साल की लड़की को कुछ हज़ार रुपयों में बेच दिया, फिर उसे 32 दरिंदों के हवाले कर दिया गया, जिन्होंने होटल के कमरों में लगातार 5 दिनों तक उसे प्रताड़ित किया।
उसके हाथ बंधे हुए थे।उन्हें जानवरों की तरह… pic.twitter.com/vIwtrJRVS8
— Nidhi (@NidhiIND07) July 7, 2026
