తన ఓటు తొలగించారంటూ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి.. ఇప్పుడే అసలు ఆట మొదలైంది అంటూ వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియమైన మిత్రులారా.. మీతో ఒక జోక్ పంచుకోవాలనుకుంటున్నాను..బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో నేను ఒకర్ని..ఇది జోక్ కదా? నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను..నా థియేటర్, నా కళ అంతా ఇక్కడే సాగింది..మీ సమాచారం కోసం చెబుతున్నాను.. నేను ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని ప్రకాశ్ రాజ్ గుర్తు చేశారు.
సరే, జోక్ బానే ఉంది.. అసలు నా ఓటు హక్కును తిరిగి పొందడానికి నేను దాటాల్సిన ప్రక్రియ ఏంటో..ఏమేం కాగితాలు చూపించాలో చూద్దాం అని చెప్పుకొచ్చారు. చివరగా సరే, గేమ్ ఆన్.. కానీ ఒక్క చిన్న విషయం.. మిమ్మల్ని ఎన్నుకోని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు..కానీ మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా.. జస్ట్ అస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
అయితే ప్రకాశ్ రాజ్ పై ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం గమనార్హం.
SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు
బెంగుళూరు నియోజకవర్గంలోనే పుట్టి, అక్కడే ఎంపీగా కూడా పోటీ చేశాను
కానీ అదే నియోజకవర్గంలో నా ఓటు తొలగించారు
మళ్లీ ఓటు రావాలంటే ఎలాంటి పత్రాలు సబ్మిట్ చేయాలో తెలియదు
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వారి తప్పిదాలపై ప్రశ్నించడానికి… pic.twitter.com/KXL2mxSheJ
— Anitha Reddy (@Anithareddyatp) August 11, 2026
