Pune Municipal Elections : పూణేలో ఓటర్లకు కారు..థాయ్ లాండ్ ట్రిప్ ఆఫర్లు

పుణె మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల బంపర్ ఆఫర్లు! ఓటేస్తే కారు, థాయ్‌లాండ్ ట్రిప్, పట్టుచీరలు ఇస్తామంటూ ప్రలోభాలు. విమాన్ నగర్, లోహెగావ్ వార్డుల్లో వెల్లువెత్తుతున్న కానుకలు.

Pune Municipal Elections : పూణేలో ఓటర్లకు కారు..థాయ్ లాండ్ ట్రిప్ ఆఫర్లు

విధాత : మాకు ఓటేస్తే.. కారు, థాయ్‌లాండ్‌ ట్రిప్‌ అంటూ ప్రచారం చేస్తున్న వైనం ఓటర్లను ఆకర్షిస్తుంది. అదే సమయంలో ఇలాంటి ఆఫర్లు ఎంటీ…ప్రజాస్వామ్యం ఎటు పోతుందన్న ఆందోళన సైతం వినిపిస్తుంది. మహారాష్ట్రలోని పుణెలో మరో మూడు వారాల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుగడలతో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఖరీదైన కానుకలు, బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలో విమన్ నగర్ కు చెందిన పలువురు అభ్యర్థులు తమకు ఓటేస్తే బంగారు ఆభరణాలు, కార్లు, విదేశీ ట్రిప్పులు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు కారు.. అయిదు రోజుల పాటు థాయ్‌లాండ్‌ పర్యటనకు తీసుకెళ్తామని ఆఫర్‌ ఇచ్చారు. ఇప్పడు సోషల్ మీడియాలో పూణే మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లకు ఇచ్చిన ఆఫర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు, అభ్యర్థులు తమకు కూడా ఇలాంటి ఆఫర్లు ఉంటే బాగుండేదేమో అనుకుంటూ కొందరు…ఇలాంటి ప్రలోభాలతో ఎన్నికలను వ్యాపారంగా మారుస్తున్నారని.. అప్రజాస్వామిక పరిస్థితిని పెంచుతున్నారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Seethakka : మేడారంలో అభివృద్ది పనుల పరిశీలన
Revanth Reddy vs KCR : ప్రజాస్వామ్యంలో అహంకార రాజకీయం