వ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య రామాలయం విరాళాల కేసులో పార్లమెంటులో చర్చకు విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. పార్లమెంటులో ఆ అంశంపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాల నిరసనల్లో భాగంగానే స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ (పప్పు యాదవ్) పార్లమెంట్ ఆవరణలో వినూత్న స్కిట్ ప్రదర్శించారు. కాషాయ వస్త్రాలు ధరించి, ఓ సన్యాసి వేషంలో వచ్చిన ఆయన.. పార్లమెంట్ పరిసరాల్లో కూర్చొని విరాళాలు సేకరించారు.
ఆయనతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రుచి వీరా (మోరదాబాద్), అవధేశ్ ప్రసాద్ (అయోధ్య) కూడా ఈ స్కిట్‌లో నటించి పప్పు యాదవ్ హుండీలో కొంత నగదు వేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అతిథి పాత్రలో కనిపించి.. ఆయన కూడా కొంత మొత్తాన్ని హుండీలో వేశారు. రాహుల్ ఇచ్చిన విరాళాన్ని హుండీలో వేయకుండా ఆ సన్యాసి తన జేబులో పెట్టుకుంటాడు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా తమ వంతుగా విరాళాలు ఇచ్చారు. ఇలా పలువురు ఎంపీలు ఇచ్చిన విరాళాలతో చివరకు ఆ సన్యాసి ఉడాయిస్తాడు. అది గమనించిన ఎంపీలు అతడిని పట్టుకొన్ని దేహశుద్ధి చేసినట్లు నటించారు. ఈ స్కిట్ పార్లమెంటు ఆవరణలో అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడ మాస్ ర్యాగింగ్ మామ అనుకుంటున్నారు.
తమ నిరసనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ స్పందిస్తూ… ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలో జరిగిన చోరీపై చర్చ చేపట్టాలని తాము పార్లమెంట్ ప్రారంభమైన రోజు నుంచి నోటీసులు ఇస్తూనే ఉన్నామని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఉభయసభల్లోనూ ఆందోళనలు రేగడంతో ఈ విషయం చర్చకు అవకాశం రాలేదని, దీనిపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ కు కేంద్రం స్పందించకపోవడంతో పప్పుయాదవ్ ఆలోచనతో ఈ స్కిట్ చేసి మా నిరసన తెలియచేశాం అని తెలిపారు. కాగా పప్పు యాదవ్ కాషాయ వస్త్రధారణతో లోక్ సభకు రావడం పట్ల స్పీకర్ ఓం బిర్లా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సభకు ఇలా విభిన్న వేషధారణలతో రావడం సరికాదంటూ సున్నితంగా మందలించారు.
