రామా­లయ ప్రారం­భో­త్సవం మోదీ కార్య­క్రమం: రాహుల్‌ గాంధీ

రామ­మం­దిరం ప్రారం­భో­త్సవం మోదీ కార్య­క్ర­మ­మని కాంగ్రెస్‌ ఎంపీ రాహు­ల్‌­గాంధీ విమ­ర్శిం­చారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సంద­ర్భంగా ఆయన మీడి­యాతో మాట్లా­డారు

రామా­లయ ప్రారం­భో­త్సవం మోదీ కార్య­క్రమం: రాహుల్‌ గాంధీ

అయో­ధ్యపై ఆరె­స్సెస్‌, బీజేపీ రాజ­కీయం

న్యూఢిల్లీ : రామ­మం­దిరం ప్రారం­భో­త్సవం మోదీ కార్య­క్ర­మ­మని కాంగ్రెస్‌ ఎంపీ రాహు­ల్‌­గాంధీ మంగ­ళ­వారం విమ­ర్శిం­చారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సంద­ర్భంగా ఆయన మీడి­యాతో మాట్లా­డారు. జన­వరి 22 నాటి కార్య­క్ర­మాన్ని ఆరె­స్సెస్‌, బీజేపీ నరేం­ద్ర­మోదీ రాజ­కీయ కార్య­క్ర­మంగా మార్చి­వే­శా­యని విమ­ర్శిం­చారు. ఇది ఆరె­స్సెస్‌, బీజేపీ కార్య­క్ర­మంగా మారిం­నం­దునే తాను దానికి హాజ­రు­కా­బో­వడం లేదని తెలి­పారు. ‘అన్ని మతాలు, సంప్ర­దా­యాలు మాకు సమానం.


హిందూ­మత పెద్దలు సైతం ఇది రాజ­కీయ కార్య­క్ర­మంగా మారిం­దని తమ అభి­ప్రా­యాలు వెల్ల­డిం­చా­రని చెప్పారు. ప్రధాని మోదీ చుట్టూ, ఆరె­స్సెస్‌ చుట్టూ తిప్పు­తున్న కార్య­క్రమం కనుకే తాము హాజ­రు­కా­వడం లేదని వివ­రిం­చారు. ఈ కార్య­క్ర­మంలో పాల్గొ­నా­లంటూ వచ్చిన ఆహ్వా­నా­లను కాంగ్రెస్‌ అధ్య­క్షుడు మల్లి­కా­ర్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్య­క్షు­రాలు సోని­యా­గాంధీ, లోక్‌­స­భలో పార్టీ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తిర­స్క­రిం­చారు. అయోధ్య కార్య­క్ర­మాన్ని ఎన్ని­కల ఫలి­తాల కోసం ఉద్దే­శిం­చిన రాజ­కీయ ప్రాజె­క్టుగా మార్చి­వే­శా­రని వారు ఆరో­పిం­చారు.