ప్రాణం మీదకు తీసుకొచ్చిన సెల్ఫీ సరదా
సెల్ఫీ సరదాలు ప్రాణాలను బలిగొంటున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నప్పటికి యువత దీని మోజు నుంచి బయటపడటం లేదు

విధాత, హైదరాబాద్ : సెల్ఫీ సరదాలు ప్రాణాలను బలిగొంటున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నప్పటికి యువత దీని మోజు నుంచి బయటపడటం లేదు. తాజాగా ఓ యువతి లోయ అంచు వద్ద సెల్ఫీ తీసుకుంటూ లోయలోకి జారీ పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
పూణేలోని వార్జేకు చెందిన 29 ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషీ స్నేహితులతో కలిసి మహారాష్ట్ర సాతారా జిల్లాలోని థోస్‌గఢ్ జలపాతాన్ని సందర్శించారు. అనంతరం అమీర్ ఖురేషీ,బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా జారిపోయింది. ప్రమాదవశాత్తు జారి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ సహాయం కోసం కేకలు వేసింది. సమీపంలోనే ఉన్న రెస్క్యూ సిబ్బంది గమనించి ఆమెను తాడు సహాయంతో లోయలోనుంచి సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. గాయాలకు గురైన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి సెల్ఫీ సరదా ప్రహాసనం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.