Shankar Lalwani | లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర.. 10 లక్షల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలుపు
Shankar Lalwani | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత శంకర్ లల్వానీ సరికొత్త చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం నుంచి ఆనయ ఏకంగా 10,08,077 ఓట్ల అఖండ మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ నేత ప్రీతమ్ ముండే గతంలో నమోదు చేసిన 6.9 లక్షల మెజార్టీ రికార్డును లల్వానీ బద్దలుకొట్టారు.
Shankar Lalwani | భోపాల్ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత శంకర్ లల్వానీ సరికొత్త చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం నుంచి ఆనయ ఏకంగా 10,08,077 ఓట్ల అఖండ మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ నేత ప్రీతమ్ ముండే గతంలో నమోదు చేసిన 6.9 లక్షల మెజార్టీ రికార్డును లల్వానీ బద్దలుకొట్టారు. ఇక్కడ చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్న సంగతి తలెఇసిందే. ఈ స్థానంలో 2.18 లక్షల మంది నోటాకు ఓటేయడం గమనార్హం.
ఇండోర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అక్షయ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ చివరి క్షణంలో బీజేపీ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ, రమేశ్ మెండోలాతో కలిసి కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అనంతరం బీజేపీలో ఆయన చేరారు. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీకి మద్దతు పలికారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర అభ్యర్థులెవరికీ మద్దతు పలకొద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్‌కు ఓటేయాలనుకునే వారంతా నోటాకు ఓటేయాలని పిలుపునిచ్చింది ఆ పార్టీ. నోటాకే ఆ పార్టీ ప్రచారం చేసింది. దాంతో నోటాకు ఈ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో 2,18,674 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 12,26,751 ఓట్లతో గెలుపొందారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి సంజయ్‌కు 51,659 ఓట్లు వచ్చాయి. ఈయన మూడో స్థానంలో నిలిచారు. ఇక బీహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు 51,660 ఓట్లు పోలయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram