Sanjay Raut | వ్యాసరచన చేస్తే నేరం సమసిపోతుందా?

పూనె- పోర్షే కారు నడిపి ఇద్దరు ప్రాణాలు బలిగొన్న ఒక బడా బిల్డర్‌ కుమారునికి బెయిలు ఇవ్వడానికి కోర్టు విధించిన షరతు ట్రాఫిక్‌ నియమాలపై వ్యాసం రాయమని.

  • By: Somu |    national |    Published on : May 22, 2024 10:15 AM IST
Sanjay Raut | వ్యాసరచన చేస్తే నేరం సమసిపోతుందా?

పూనె- పోర్షే కారు నడిపి ఇద్దరు ప్రాణాలు బలిగొన్న ఒక బడా బిల్డర్‌ కుమారునికి బెయిలు ఇవ్వడానికి కోర్టు విధించిన షరతు ట్రాఫిక్‌ నియమాలపై వ్యాసం రాయమని. ఈ తీర్పుపై పెద్ద దుమారం చెలరేగుతున్నది. న్యాయమూర్తి ఇటువంటి ఆదేశాలు ఎలా ఇస్తారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫడ్నవిస్‌ చెప్పారు.

ప్రమాదానికి కారకుడైన మైనర్‌ ఔరంగాబాద్‌కు చెందిన ఒక పెద్ద బిల్డర్‌ విశాల్‌ అగర్వాల్‌ కుమారుడు. బిల్డర్‌ను మంగళవారం నాడు అరెస్టు చేశారు. నేరస్థులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. బిల్డర్‌ తండ్రి, ప్రమాదానికి కారకుడైన వేదాంత్‌ అగర్వాల్‌ తాత సురేంద్ర కుమార్‌ అగర్వాల్‌కు మాఫియా నాయకులతో సంబంధాలు ఉన్నాయని తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఒక ఆస్తి వివాదం పరిష్కారంలో సురేంద్ర ఆగర్వాల్‌ చోటారాజన్‌ సహాయం తీసుకున్నారని ఆ వివాదంలో బాధితులు ఇప్పుడు బయటపెట్టారు.