Silver Price Today| వెండి ధర రూ.11వేలు పైకి..రూ.2లక్షల 22వేలు
మార్కెట్ నిపుణుల అంచనాలను మించి వెండి, పసిడి ధరలు పరుగు పెడుతున్నాయి. బుధవారం ఒక్క రోజునే కిలో వెండి ధర రూ.11వేలు పెరిగి రూ.2లక్షల 22వేలకు చేరి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.
విధాత: మార్కెట్ నిపుణుల అంచనాలను మించి వెండి, పసిడి ధరలు పరుగు( Silver, Gold Price) పెడుతున్నాయి. బుధవారం ఒక్క రోజునే కిలో వెండి ధర రూ.11వేలు పెరిగి రూ.2లక్షల 22వేలకు చేరి ఆల్ టైమ్ రికార్డు(All Time High)ను నమోదు చేసింది. 10రోజులలో రూ.24వేలు పెరగడం విశేషం. డిసెంబర్ 8వ తేదీన రూ.1,98,000గా ఉన్న కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,22,000కు చేరడం గమనార్హం. వెండి ఆభరణాలు..పెట్టుబడి సాధనంగా మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడం..డిమాండ్ కు, ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. డాలర్ తో రూపాయి విలువ హెచ్చు తగ్గులు కూడా వెండి, పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రానున్న కొత్త ఏడాదిలో వెండి రూ.1లక్ష 50వేల మార్క్ చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
బంగారం ధరలు రూ.6,50పెంపు
బంగారం ధరలు బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.650 పెరిగి.. రూ.1,34,510కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.600పెరిగి..రూ.1,22,700వద్ధ నిలిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram