ఓటు హ‌క్కు వినియోగించుకున్న సోనియా, రాహుల్.. ఆ త‌ర్వాత సెల్ఫీ

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఆరో ద‌శ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు

ఓటు హ‌క్కు వినియోగించుకున్న సోనియా, రాహుల్.. ఆ త‌ర్వాత సెల్ఫీ

న్యూఢిల్లీ : సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఆరో ద‌శ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మాణ్ భ‌వ‌న్‌లో వీరిద్ద‌రూ త‌మ ఓటును వేశారు. పోలింగ్ బూత్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం రాహుల్ త‌న త‌ల్లి సోనియాతో సెల్ఫీ దిగారు.

కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, రాహుల్ సోద‌రి ప్రియాంక గాంధీ వాద్రా కూడా త‌న ఓటు హ‌క్కును ఢిల్లీలోని పోలింగ్ స్టేష‌న్‌లో వినియోగించుకున్నారు. ప్రియాంక పిల్లలు రైహాన్‌ రాజీవ్‌ వాద్రా, మిరయా వాద్రా కూడా ఓటు వేశారు.

నేను, అమ్మ క‌లిసి ఓటేశాము. ప్ర‌జాస్వామ్యంలో ఇది ఒక గొప్ప పండుగ‌. మీరంద‌రూ కూడా నివాసాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటు వేయాలి. ఓటు వేయ‌డం మీ హ‌క్కు.. మీ కుటుంబ భ‌విష్య‌త్‌కు త‌ప్పనిస‌రిగా ఓటు వేయాల‌ని రాహుల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.