కేజ్రీవాల్‌ బెయిల్‌పై మే 10న సుప్రీంకోర్టు ఉత్తర్వులు

ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయంలో మే 10న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించనున్నది

కేజ్రీవాల్‌ బెయిల్‌పై మే 10న సుప్రీంకోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయంలో మే 10న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. ‘(మధ్యంతర బెయిల్‌పై) మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వెల్లడిస్తాం. అరెస్టును సవాలు చేసిన అంశాన్ని సైతం అదే రోజు చేపడుతాం’ అని తెలిపింది. ఈ ధర్మాసనంలో ఈసారి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. జస్టిస్‌ ఖన్నాతోపాటు జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ఉన్నారు.