Telangana Cyber Security| సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఉక్కుపాదం
సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపింది. ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్ కు సంబంధించి 81 మందిని అరెస్టు చేశారు.
విధాత, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Telangana Cyber Security Bureau) ఉక్కుపాదం మోపింది. ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్ కు సంబంధించి 81 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 84 ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల్లో 17 మంది పురుషులు, ఏడుగురు మహిళలున్నారు. 58 మంది మ్యూల్ ఖాతాదారులున్నట్లు గుర్తించారు. నిందితుల ఖాతాలోని రూ.కోట్లాది నగదును ఫ్రీజ్ చేశారు. దీన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు అందించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram