కేజ్రీ వాల్ కు దక్కని ఊరట … బెయిల్ పై హైకోర్టు స్టే

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు మంజూరుచేసిన బెయిల్ పై హైకోర్టు స్టే విధించింది.

కేజ్రీ వాల్ కు దక్కని ఊరట … బెయిల్ పై హైకోర్టు స్టే

విధాత : ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు మంజూరుచేసిన బెయిల్ పై హైకోర్టు స్టే విధించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిస్థాయిలో ఆలోచన చేయలేదని పేర్కొంది. బెయిల్ పై విచారణ సమయంలో ఈడీకి తగిన అవకాశం ఇవ్వాల్సిందని చెప్పింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి తిహార్ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఈ కేసులో క్రేజీవాల్ కు సాధారణ బెయిల్ మంజూరుచేస్తూ ట్రయల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే.. ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ కేజీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు కుంటుందని.. అప్పటివరకు వేచి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. దీనిపై నేడు బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపడతామని తెలిపింది.