• Telugu News
  • /National

Dal Lake | చలిగుప్పిట్లో అందాల కశ్మీర్‌.. గడ్డకట్టిన దాల్‌ సరస్సు

కశ్మీర్లో చలి పులి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మంచు వర్షం కురుస్తున్నది. ప్రఖ్యత దాల్ సరస్సు గడ్డకట్టుకు పోతున్నది.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Jan 10, 2026, 9:11 pm IST
Read Time: 4 mins
Dal Lake | చలిగుప్పిట్లో అందాల కశ్మీర్‌.. గడ్డకట్టిన దాల్‌ సరస్సు

Dal Lake | చలి తీవ్రతకు జమ్ము కశ్మీర్‌ (Jammu and Kashmir) గజగజ వణికిపోతోంది. శీతాకాలం కావడంతో కశ్మీర్‌ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వ్యాలీ (Kashmir Valley) మొత్తం విపరీతంగా మంచు వర్షం కురుస్తోంది. రోడ్లు, ఇళ్లు, వాహనాలు, చెట్లపై పంచు పేరుకుపోయింది. అతిశీతల వాతావరణం నెలకొంది. దీంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.

కొన్ని ఏరియాల్లో అయితే మైనస్‌ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి (Temperatures Drop Below Zero). ఫలితంగా వ్యాలీ వ్యాప్తంగా సరస్సులు, కొలనుల్లో నీరు గడ్డ కట్టుకుపోయింది. కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు నీరు గడ్డకట్టింది. పైన మొత్తం మంచు పొర పేరుకుపోయింది. ఈ చలికి సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అందాల శ్రీనగర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.

వాతావరణ శాఖ డేటా ప్రకారం.. కశ్మీర్‌ అంతటా చలి తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌ 7.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుల్మార్గ్ (Gulmarg)‌, సోనామార్గ్, పహల్గామ్‌ (Pahalgam) వంటి హిల్‌ స్టేషన్లలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువకు పడిపోయాయి. శ్రీనగర్‌ (Srinagar)లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. షోపియన్‌ అత్యంత శీతల ప్రదేశంగా నిలిచింది. పహల్గామ్‌లో మైనస్‌ 7.6 డిగ్రీల సెల్సియస్‌, పుల్వామాలో మైనస్‌ 6.8 డిగ్రీల సెల్సియస్‌, శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో మైనస్‌ 7.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంత్‌నాగ్‌లో మైనస్ 6.3 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 7.1 డిగ్రీల సెల్సియస్‌కు, సోపోర్‌లో మైనస్ 6.8 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. ఖాజిగుండ్, బుడ్గామ్, పాంపోర్‌లలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి తగ్గాయి.