అడవులు విస్తీర్ణం తరిగిపోతున్న నేపథ్యంలో అటవీ సరిహద్దుల్లోని గ్రామాలలోకి పెద్ద పులులు, చిరుతలు, ఏనుగులు ప్రవేశించి మనుషులపై దాడి చేయడం పెరిగిపోతుంది. అటవీ ప్రాంతం సమీప జనావాసం పరిధిలోకి వచ్చిన ఓ పెద్ద పులి గుర్రంపై దాచి చేసి అడవిలోకి లాక్కెళ్లిన ఘటన వీడియో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గర్జియా దేవి ఆలయం సమీపంలో ఓ బెంగాల్ టైగర్..ఓ పెంపుడు గుర్రంపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు, పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది.
గుర్రం మెడను నోట కరుచుకుని బలమైన గుర్రం శరీరాన్ని పెద్దపులి తన బలంతో సునాసయంగా అటవీ పరిధిలోకి లాక్కెళ్లడం చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. పెద్దపులి దాడి ఘటనతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ పెంచి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
🐅 గర్జియా సమీపంలో గుర్రంపై పులి దాడి.. అడవిలోకి లాక్కెళ్లిన వైనం
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గర్జియా దేవి ఆలయం సమీపంలో ఓ బెంగాల్ టైగర్ గుర్రంపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు, పర్యాటకుల్లో… pic.twitter.com/gqdVIhGYP3
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) August 17, 2026
