Waqf Properties | యూపీలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు.. ఆ తరువాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు
రాష్ట్రాల వారీగా మొత్తం వక్ఫ్ ఆస్తులలో కర్నాటకలో 81 శాతం, జమ్మూ కాశ్మీర్ లో 77 శాతం, పంజాబ్ లో 90, గుజరాత్ లో 61 శాతం ఉమ్మీద్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా 86,345, మహారాష్ట్రలో 62,939, కర్నాటకలో 58,328, కేరళలో 42,772 ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశారు.
Waqf PropParents Promotion | 2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు.. అభిమానులకు డబుల్ సెలబ్రేషన్స్!erties | దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న వక్ఫ్ ఆస్తులలో ఇప్పటి వరకు 27 శాతం మాత్రమే ఉమ్మీద్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. పలు రాష్ట్రాలలో 8.8 లక్షల వరకు వక్ఫ్ ఆస్తులు ఉండగా కేవలం 2.16 లక్షల ఆస్తుల వివరాలు పోర్టల్‌లోకి ఎక్కించేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 2.4 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఆ తరువాత వరుసగా పశ్చిమ బెంగాల్ 80,480, పంజాబ్ 75,511, తమిళనాడు 66,092, కర్నాటక 65,242 ఆస్తులు ఉండగా ఆరవ స్థానంలో మహారాష్ట్ర 36,700 ఆస్తులతో ఉంది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సున్నీ, షియా బోర్డుల వారీగా ఆస్తులు ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా మొత్తం వక్ఫ్ ఆస్తులలో కర్నాటకలో 81 శాతం, జమ్మూ కాశ్మీర్ లో 77 శాతం, పంజాబ్ లో 90, గుజరాత్ లో 61 శాతం ఉమ్మీద్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా 86,345, మహారాష్ట్రలో 62,939, కర్నాటకలో 58,328, కేరళలో 42,772 ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 0.89 ఆస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం ఆస్తులు 80,480 ఉండగా కేవలం 716 ఆస్తులను మాత్రమే వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల వివరాలను చేర్చేది లేదని మమతాబెనర్జీ చెప్పినా.. కేంద్రం ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడవు డిసెంబర్ 5వ తేదీ, 2025 నాటికి వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయని వారు మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజ్ ప్రకటించారు. గడువు పెంచేందుకు సంబంధిత రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించి గడువు పెంచుకోవచ్చని కూడా తెలిపారు. కేంద్ర మంత్రి ప్రకటనతో పలు రాష్ట్రాలకు చెందిన బోర్డులు ట్రిబ్యునళ్లను ఆశ్రయించి గడువు పెంపు ఉత్తర్వులు తెచ్చుకుంటున్నాయి. డాక్యుమెంట్లు పురాతన కాలానికి చెందినవి కావడం, భూముల కొలతల్లో తేడాలు ఉండడం, సరైన ఆధారాలు లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఉమ్మీద్ పోర్టల్‌లో మూడు దశల్లో వివరాలు చేర్చుతున్నారు. తొలుత కేర్ టేకర్ ఆస్తుల వివరాలు నమోదు చేసిన తరువాత, వాటిని వక్ఫ్ బోర్డు ఉద్యోగులు పరిశీలిస్తుననారు. మూడో దశలో వక్ఫ్ బోర్డు సీఈఓలు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
దేశంలోని ఆస్తులలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ వాటా 27 శాతం (2.4 లక్షలు) ఉంది. సున్నీ బోర్డుకు చెందినవి 2,17,161, షియా బోర్డుకు 15,386 ఉండగా ఇందులో స్మశానాలకు 17.3 శాతం, వ్యవసాయ భూములు 16 శాతం, మసీదులకు 14 శాతం వరకు ఉన్నట్లు వెల్లడి అయ్యింది. లక్నో, మీరట్ ప్రాంతాలలో అత్యధిక కమర్షియల్ విలువ గల ఆస్తులు ఉన్నాయి. ఆగ్రా రాష్ట్రంలోని తాజ్ మహల్ ను వక్ఫ్ ఆస్తి కింద పరిగణించాలని కోరుతున్నారు. అయితే ఈ కట్టడం జాతీయ వారసత్వ కట్టడం కిందకు రావడంతో వక్ఫ్ కింద పరిగణించడం కష్టంగా మారింది.
Read Also |
ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి
Tollywood | 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే.. ‘అఖండ 2’కు చోటు దక్కుతుందా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram