Wash Room | వాష్‌రూమ్‌లో 5 నిమిషాలు గడిపిన మహిళ.. రూ. 805 వసూలు చేసిన హోటల్ యజమాని
Wash Room | ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు సులభ్ కాంప్లెక్స్( Sulabh Complex )ను వాడుతుంటాం.. దానికి 5 రూపాయాల వరకు ఛార్జ్ వసూలు చేస్తుంటారు. కానీ ఓ హోటల్( Hotel ) యజమాని.. 5 నిమిషాలు వాష్‌రూమ్ వినియోగించినందుకు రూ. 805 వసూలు చేశాడు.

Wash Room | వాష్ రూమ్( Wash Room )లో 5 నిమిషాలు గడిపితే రూ. 805 చెల్లించాలా..? అనే సందేహం మీకు రావొచ్చు. కానీ మీరు చదువుతున్నది అక్షరాల సత్యం. అత్యవసర పరిస్థితిలో వాష్‌రూమ్‌కు వెళ్లినందుకు ఓ హోటల్( Hotel ) యజమాని.. సదరు మహిళ నుంచి అక్షరాలా.. 805 రూపాయాలు వసూలు చేశాడు.
అసలేం జరిగిందంటే..?
మేఘా ఉపాధ్యాయ అనే ఓ మహిళ జర్నలిస్టు తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లో పర్యటించేందుకు వెళ్లారు. పర్యటనలో భాగంగా రాజస్థాన్‌లోని ఖతు శ్యామ్ ఆలయాన్ని సందర్శించేందుకు మేఘా ఉపాధ్యయ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ రోజు ఉదయం 6 గంటలకు తమ హోటల్ నుంచి బయల్దేరింది.
ఇక ఉపాధ్యాయ తల్లి కూడా దర్శనం కోసం రెండు గంటల పాటు క్యూలైన్‌లో నిల్చుంది. ఈ క్రమంలో ఆమె తల్లి తీవ్ర నీరసానికి గురైంది. కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకుంది. అప్రమత్తమైన మేఘా ఉపాధ్యాయ తన తల్లిని ఆలయానికి సమీపంలో ఉన్న ఓ హోటల్‌కు తీసుకెళ్లింది. తన తల్లి వాంతులు చేసుకుంటుందని, కాస్త ఓ ఐదు నిమిషాలు వాష్ రూమ్ యూజ్ చేసుకుంటామని చెప్పింది. కానీ హోటల్ యజమాని అందుకు అంగీకరించలేదు. అద్దెకు గది తీసుకోవాలని తేల్చిచెప్పాడు. మాకు రూమ్ అవసరం లేదు.. కేవలం వాష్‌రూమ్ కావాలి. అది కూడా 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే అని చెప్పారు. ఎమర్జెన్సీ అని వేడుకున్నారు. తన వైపు రిసెప్షనిస్ట్ ఒకరకంగా చూసి.. 5 నిమిషాలు వాష్‌రూమ్ యూజ్ చేస్తే రూ. 805 చెల్లించాలని చెప్పాడు. వేరే దారి లేక.. అత్యవసరం కాబట్టి ఆ హోటల్‌లోనే వాష్‌రూమ్ ఉపయోగించుకుని రూ. 805 చెల్లించినట్లు మేఘా ఉపాధ్యాయ పేర్కొన్నారు. తాము బస చేసిన హోటల్ ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడికి వెళ్లలేకపోయామని మేఘా ఉపాధ్యాయ తెలిపారు.