విధాత, హైదరాబాద్ : ఆదాయం అధికంగా ఉన్నా..అంతకు మించి పని ఒత్తిడితో ఐటీ ఉద్యోగులు రోజులు వెళ్లదీస్తుంటారు. అయితే ఓ మహిళ తను చేస్తున్న ఐటీ ఉద్యోగంలో పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగానికి గుడ్ బై కొట్టేసి..ఆటో డ్రైవర్ గా మారిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ ఐటీ కంపెనీలో లక్షల రూపాయల ప్యాకేజీతో కూడిన మేనేజర్ ఉద్యోగం వదిలేసి..ఆటో డ్రైవర్‌గా మారి నెలకు రూ.60,000 సంపాదిస్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయంపై మీడియా ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ఐటీ ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుందని, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని..ఇప్పుడు ఆటో డ్రైవర్ వృత్తిలో తను మానసిక ప్రశాంతత పొందుతున్నాని సమాధానం ఇచ్చింది. ఆటో నడిపేందుకు తనే సొంతంగా ఆటో కొనుగోలు చేశానని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ఇది చూసిన నెటిజన్లు ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నపని ఒత్తిడికి ఇదొక నిదర్శనం అని..కంపెనీలు ఇలాంటి ఘటనలతోనైనా దిద్దుబాటు చర్చలు తీసుకోవాలని కోరుతున్నారు. పురుషులు మాత్రమే కనిపించే ఆటో డ్రైవర్ వృత్తిలో ఓ మహిళ ..అందులోనూ ఓ మాజీ ఐటీ మేనేజర్ చేరిపోయి రాణిస్తుండటం స్ఫూర్తిదాయకం అని అభినందిస్తున్నారు.