Bangalore Techie | కార్పొరేట్ జాబ్ వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన బెంగళూరు టెకీ..!
Bangalore Techie | కార్పొరేట్ కంపెనీలో జాబ్.. భారీ జీతం.. లగ్జరీ లైఫ్.. అందరూ కలలు కనే జీవితం.! కానీ దాన్ని తృణప్రాయంగా వదిలేశాడో టెకీ! కార్పొరేట్ జాబ్ వదిలేసి బెంగళూరు వీధుల్లో ఆటో నడుపుకుంటున్నాడు..
Bangalore Techie | కార్పొరేట్ కంపెనీలో జాబ్.. భారీ జీతం.. లగ్జరీ లైఫ్.. అందరూ కలలు కనే జీవితం.! కానీ దాన్ని తృణప్రాయంగా వదిలేశాడో టెకీ! కార్పొరేట్ జాబ్ వదిలేసి బెంగళూరు వీధుల్లో ఆటో నడుపుకుంటున్నాడు.. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న అతని కథ ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది.
బెంగళూరుకు చెందిన రాకేశ్ తొలుత ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేశాడు. దాని తర్వాత పెద్ద బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ చేస్తూ మంచి స్థాయికి చేరుకున్నాడు. అందరూ కలలు కనే జీతం, జీవితాన్ని సంపాదించాడు. అలా తన చుట్టూ ఉన్న వారి దృష్టిలో సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మారాడు. కానీ అతనికి మాత్రం జీవితంలో సంతృప్తిగా లేదు. జాబ్‌లో చేరి ఎదుగుతున్న సమయంలో అందరిలా హ్యాపీగానే ఫీలయ్యాడు. కానీ ఒకానొక దశకు చేరుకున్న తర్వాత ఏదో ఓ వెలితిగా అనిపించింది. ఇతరుల కోసం జీవిస్తున్నానే తప్ప.. తన కోసం తాను బతకడం లేదన్న ఆలోచన మొదలైంది.
ముఖ్యంగా టార్గెట్ల కోసం పరుగులు పెట్టడం మానసికంగా ఒత్తిడిని కలగజేసింది. వాళ్ల కోసం తనను వాడుకుంటున్నారనే భావన అతనిలో అసహనాన్ని పెంచింది. ఇదే సమయంలో కుటుంబంలో తండ్రితో విభేదాలు వచ్చాయి. దాంపత్య జీవితంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. వీటన్నింటినీ మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. ఏదైనా ఒక చిన్న ఘటన జరిగినా దాని గురించి గంటల తరబడి ఆలోచించేవాడు. బయటకు వెళ్లాలంటే కూడా భయపడిపోయాడు. అలా బాగా కుంగిపోవడంతో చివరకు సైకియాట్రిస్ట్‌లను కలవాల్సిన పరిస్థితి ఎదురైంది. అలా కొద్దిరోజులు మానసిక చికిత్స తీసుకున్న అతను.. యాంటీ డిప్రెషన్ మందులను కూడా వాడాడు.
అలా మానసిక నిపుణుల దగ్గరకు వెళ్తున్న సమయంలోనే సైకాలజీపై అధ్యయనం చేశాడు. తన ఆలోచనలు అర్థం చేసుకుని.. జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా ఆరోగ్యంపై దృష్టి పెట్టి.. వివిధ రకాల డైట్‌లు పాటించి 15 కిలోల వరకు బరువు తగ్గాడు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు ముయ్ థాయ్, జూ జిట్స్ వంటి క్రీడల్లోనూ ప్రావీణ్యం సాధించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకం కూడా గెలుచుకున్నాడు.
జీవితాన్ని తిరిగి పొందే క్రమంలో ఎలాంటి పని అయినా చేయడం మంచిదే అని రాకేశ్ అనుకున్నాడు. అందుకే ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి బైక్ టాక్సీ డ్రైవర్‌గా, జిమ్ సహాయకుడిగా ఇలా విభిన్న పనులు చేశాడు. ఇప్పుడు బెంగళూరులో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఖాళీ సమయంలో డ్యాన్స్, పెయింటింగ్ వంటి తన అభిరుచులపై సమయం కేటాయిస్తున్నాడు. ఇప్పుడు రాకేశ్ జీవితం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన చాలామంది జీతం, హోదా కంటే మనశ్శాంతి, స్వీయ ఆనందమే జీవితంలో ముఖ్యమని చెప్పుకుంటున్నారు.
View this post on Instagram
Read More:
68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ
మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram