19 ఏండ్ల యువతి నిన్న పెట్రోల్ బంక్‌లో కిడ్నాప్‌నకు గురైన సంగతి తెలిసిందే. ఆ యువతి ఇవాళ లాడ్జిలో ప్రత్యక్షమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
భోపాల్ : ఓ 19 ఏండ్ల యువతి నిన్న పెట్రోల్ బంక్‌లో కిడ్నాప్‌నకు గురైన సంగతి తెలిసిందే. ఆ యువతి ఇవాళ లాడ్జిలో ప్రత్యక్షమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని దాటియాకు చెందిన ఓ యువతి ఝాన్సీ రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ బస్టాప్‌లో నిన్న ఉదయం 9:30 గంటలకు బస్సు దిగింది. అక్కడే ఉన్న పెట్రోల్ బంక్‌లో ఉన్న ఇద్దరు యువకులు ఆ యువతిని బలవంతంగా తమ బైక్‌పై తీసుకెళ్లారు.
దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులను అప్రమత్తం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. గునాలోని ఓ లాడ్జిలో అమ్మాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి పోలీసులు యువతిని కాపాడారు. ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. యువతి సొంత జిల్లా భింద్ అని పోలీసులు తెలిపారు.