Woman stays in two states | వంట గ‌ది గుజ‌రాత్‌లో.. ప‌డ‌క గ‌ది మ‌హారాష్ట్ర‌లో.. ఓ ఇంటి క‌థ ఇదీ..

Woman stays in two states | గుజ‌రాత్‌( Gujarat )లో వంట చేస్తాను.. మ‌హారాష్ట్ర‌( Maharashtra )లో ఆర‌గిస్తాను.. ఔనండి.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. ఎందుకంటే నా వంటి గ‌ది( Kitchen ) గుజ‌రాత్‌లో ఉంది.. హాల్, బెడ్రూం( Bed Room ) మ‌హారాష్ట్ర‌లో ఉంది అంటుంది మ‌గ‌నిబెన్ గ‌మిత్( Maganiben Gamit ).

Woman stays in two states | వంట గ‌ది గుజ‌రాత్‌లో.. ప‌డ‌క గ‌ది మ‌హారాష్ట్ర‌లో.. ఓ ఇంటి క‌థ ఇదీ..

Woman stays in two states | గ్రామానికి గ్రామానికి మ‌ధ్య, జిల్లాకు జిల్లాకు మ‌ధ్య‌, రాష్ట్రానికి రాష్ట్రానికి మ‌ధ్య, దేశానికి దేశానికి మ‌ధ్య స‌రిహ‌ద్దులు( Borders ) ఉండ‌డం కామ‌న్. ఇక‌ ఈ స‌రిహ‌ద్దుల‌ను బ‌ట్టి ఇది మా ప్రాంతం అని నిర్ధారించుకుంటారు. కానీ ఈ ఇల్లు( House )ను చూస్తే స‌రిహ‌ద్దు తేడా తెలియ‌నే తెలియ‌దు. భూమి( Earth ) మీద నుంచి చూసిన‌ప్పుడు ఇది ఒక స‌రిహ‌ద్దుకే ప‌రిమిత‌మైంద‌ని భావిస్తాం. కానీ డ్రోన్ విజువ‌ల్స్‌( Drone Visuals )లో చూస్తే.. ఈ ఇల్లు రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దులో ఉన్న‌ద‌ని నిర్ధారిస్తాం. మ‌రి రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో( Two States Borders ) ఉన్న ఆ ఇంటి గురించి తెలుసుకోవాలంటే అటు గుజ‌రాత్( Gujarat ), ఇటు మ‌హారాష్ట్ర( Maharashtra ) వెళ్ల‌క త‌ప్ప‌దు.

గుజ‌రాత్ – మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో( Gujarat – Maharashtra  Borders) ఉన్న ఆ ఇంటి క‌థ గురించి.. ఆ ఇంటి య‌జ‌మానురాలి మాట‌ల్లోనే విందాం.. నా పేరు మ‌గ‌నిబెన్ గ‌మిత్( Maganiben Gamit ).. నా వ‌య‌సు 70 ఏండ్లు. నా భ‌ర్త చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి అంటే రెండు ద‌శాబ్దాల నుంచి ఈ ఇంట్లో ఒంట‌రిగా నివసిస్తున్నాను. ఇక గుజ‌రాత్‌లో వంట వండి.. మహారాష్ట్ర‌లో ఆర‌గిస్తాను. ఎందుకంటే నా వంట గ‌ది( Kitchen ) గుజ‌రాత్‌ స‌రిహ‌ద్దులోని గైశ్వార్ గ్రామ( Gaiswar village ) ప‌రిధిలో ఉంటుంది. మెయిన్ డోర్, ప‌డ‌క గ‌ది.. మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దులోని కోక‌ర్‌వాలా గ్రామ(Khokarwala village ) ప‌రిధిలో ఉంటుంది. ఓటు( Vote ) మాత్రం గుజ‌రాత్‌లోనే వేస్తాను.

ఇప్ప‌టికీ నా ఇంటికి విద్యుత్ స‌ర‌ఫ‌రా లేదు. ఈ రెండు గ్రామాల‌కు కొంచెం దూరంలో నా ఇల్లు ఉంది కాబ‌ట్టి. గ్రామ‌స్తులు విద్యుత్ స‌ర‌ఫ‌రా( Power Supply ) చేస్తామంటే నేను అవ‌స‌రం లేద‌న్నాను. కానీ గైశ్వార్, కోక‌ర్‌వాలా గ్రామాల ప్ర‌జ‌లు న‌న్ను ఎంతో ఆప్యాయంగా ప‌లుక‌రిస్తారు. గైశ్వార్ గ్రామ ప‌రిధిలో ఉన్న కిచెన్‌లో కొంత మ‌బ్బు ఉంటుంది. దీంతో కోక‌ర్‌వాలా గ్రామ ప‌రిధిలో ఉన్న హాల్‌లో భోజ‌నం చేస్తాను. ఇక్క‌డ వెలుతురు బాగా ఉంటుంది కాబ‌ట్టి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ( Welfare Schemes ) గుజ‌రాత్ రాష్ట్రం నుంచే పొందుతాను. ఓటు హ‌క్కు కూడా గుజ‌రాత్‌లోనే వినియోగించుకుంటాను. ఇంటి ప‌న్ను కూడా గుజ‌రాత్ రాష్ట్ర ఖ‌జానాకే చెల్లిస్తాను అని చిరున‌వ్వుతో చెప్పారు మగ‌నిబెన్.

ఇక రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న మ‌గ‌నిబెన్( Maganiben Gamit ) ఇంటిని సంద‌ర్శించేందుకు చాలా మంది ప‌ర్యాట‌కులు( Tourists ) వ‌స్తుంటారు. ఇప్ప‌టికే కొన్ని వేల మంది ఆ ఇంటిని సంద‌ర్శించారు. మ‌న‌షుల మ‌ధ్య ఎలాంటి వైష‌మ్యాలు లేకుంటే.. స‌రిహ‌ద్దులు కూడా ఏం చేయ‌లేవ‌న్నారు మ‌గ‌నిబెన్‌.