కండక్టర్‌తో వెళ్లిన యూట్యూబర్ భార్య కేసులో బిగ్ ట్విస్ట్

యూ ట్యూబర్ అఖిల్ భార్య మేఘా తను ప్రేమించిన బస్ కండక్టర్ తో లేచిపోయిన ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అఖిల్ తనను సరిగ్గా చూసుకోవడం లేదని ఇన్‌స్టాలో మేఘా వీడియో పోస్టు చేయగా..అది వైరల్ గా మారింది.

యూ ట్యూబర్ అఖిల్ భార్య మేఘా తను ప్రేమించిన బస్ కండక్టర్ తో లేచిపోయిన ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అఖిల్ తనను సరిగ్గా చూసుకోవడం లేదని ఇన్‌స్టాలో మేఘా వీడియో పోస్టు చేయగా..అది వైరల్ గా మారింది. అఖిల్ కు ఇతర యువతులతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ మేఘా ఆరోపించింది.

రోజూ తనను వేధించేవాడని, అందుకే ఇంటి నుంచి పారిపోయానని మేఘా వెల్లడించింది. కండక్టర్ అయినా, క్లీనర్ అయినా నేను అతనితోనే కలిసి ఉంటానని మేఘా స్పష్టం చేసింది. తను లేకపోతే తాను ఉండలేనని.. కండక్టర్‌తోనే కలిసి బతుకుతానన్న మేఘా పేర్కొంది. తామిద్దరిని విడదీయొద్దంటూ.. ఇన్‌స్టా వీడియోలో మేఘా వేడుకుంది. అయితే నెటిజన్ల నుంచి ఆమెపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మేఘా తను పోస్ట్ చేసిన వీడియోను తర్వాతా కొద్దిసేపటికే డిలీట్ చేసేయడం ఆసక్తికరంగా మారింది.

యూట్యూబర్ అఖిల్, మేఘాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు కలిసి చేసిన వీడియోలతో సోషల్ మీడియాలో వారు పాపులర్ జంటగా లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. అనోన్యమైన వారి జంట విడిపోవడం, మేఘ కండక్టర్ తో లేచిపోవడం..అఖిల్, మేఘాలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ వీడియోలు విడుదల చేయడం వైరల్ గా మారిపోయింది.

 

Latest News